Walking | వాకింగ్‌కు ఏ సమయం బెటర్..! ఉదయమా..? సాయంత్రమా..?
Walking | కొన్నాళ్ల పాటు ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలనుకుంటే నడక( Walking )ను దినచర్యలో భాగం చేసుకోవాలి. సంపాదన ఒక్కటే సరిపోదు. కాబట్టి ప్రతి రోజు కనీసం కిలోమీటర్ అయినా నడిస్తే ఆరోగ్యానికి( Health ) ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు( Health Experts ) చెబుతున్నారు.

Walking | కడుపు నింపుకునేందుకు, కంటి నిండా నిద్ర పోయేందుకు రాత్రింబవళ్లు కష్టపడుతుంటాం. సంపాదించిన సంపాదనతలో మూడు పూటలు హాయిగా తింటాం.. అలా సేద తీరుతుంటాం. కానీ కొన్నాళ్ల పాటు ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలనుకుంటే నడక( Walking )ను దినచర్యలో భాగం చేసుకోవాలి. సంపాదన ఒక్కటే సరిపోదు. కాబట్టి ప్రతి రోజు కనీసం కిలోమీటర్ అయినా నడిస్తే ఆరోగ్యానికి( Health ) ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు( Health Experts ) చెబుతున్నారు. అయితే చాలా మంది ఉదయమే వాకింగ్( Mrning Walking ) చేస్తుంటారు. ఉదయం వీలు కానివారు సాయంత్రం వేళ వాకింగ్‌కు వెళ్తుంటారు. అయితే ఏ సమయంలో వాకింగ్ చేస్తే బెటరో తెలుసుకుందాం.
ఉదయం వేళ నడక చేస్తే కలిగే లాభాలివే.. ( Morning Walk Benefits )
తెల్లవారుజామున పార్కు( Park )లో లేదా నిర్మలమైన వాతావరణం ఉండే ప్రదేశంలో వాకింగ్( Walking ) చేయడం వల్ల శారీరక, మానసిక ప్రయోజనాలు పొందొచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. శరీరానికి ప్యూర్ ఆక్సిజన్( Oxygen ) అందడంతో.. ఆ రోజు చేసే పనుల్లో సృజనాత్మకత, ఉత్పత్తి పెరుగుతుంది. అంతేకాకుండా మనం చేయదలచుకున్న పనుల్లో క్లారిటీ వస్తుంది. ఇక మెటబాలీజం( Metabolism ) పెరిగి బరువు కూడా తగ్గే అవకాశం ఉంది. ఫ్యాట్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
సాయంత్రం నడక వల్ల కలిగే లాభాలివే.. ( Evening Walk Benefits )
ఉదయం పూట వాకింగ్ చేయడం కుదరని వారు.. సాయంత్రం వేళ వాకింగ్‌కు వెళ్లేందుకు ప్రాధాన్యత ఇస్తుంటారు. సాయంత్రం వాకింగ్( Evening Walking ) వల్ల కూడా హెల్త్ బెనిఫిట్స్( Health Benefits ) ఎన్నో ఉన్నాయి. మానసికంగా ఒత్తిడి తగ్గతుంంది. రిలాక్స్ అవుతారు. నిద్ర నాణ్యతో పెరగడంతో పాటు నిద్ర సమస్యలు ఉన్నవారికి సాయంత్రం నడక మంచి ఫలితాలను ఇస్తుంది. జీర్ణ సమస్యలు కూడా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మరి ఏ సమయం బెస్ట్ అంటే..?
ఉదయం నడిచినా.. సాయంత్రం నడిచినా ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలే అందుతాయి. కాబట్టి మీకు ఏ సమయం అనువుగా ఉంటుందో చూసుకోవాలి. అంతేకాకుండా వాతావరణం ఏ సమయంలో అనుకూలంగా ఉందో చూసుకుని వాక్ చేసుకుంటే ఇబ్బందులు ఉండవు. కాబట్టి వ్యక్తిగత సమయాలకు అనుగుణంగా దీనిని ప్లాన్ చేసుకోవచ్చు. అయితే కొందరు అదే పనిగా ఎక్కువ నడుస్తారు. అది మంచిది.