ఏ నీళ్లతో స్నానం మంచిది..? చన్నీళ్లా.. వేడి నీళ్లా..?
Health Tips | ఓ వైపు చలి చంపేస్తుంది. మరో వైపు నీళ్లు కూడా చల్లగా ఉంటున్నాయి. పొద్దున, సాయంత్రం వేళల్లో నీటిని ముట్టుకోవాలంటే చేతులు వణికిపోతున్నాయి. చన్నీళ్లతో స్నానం చేయాలంటేనే భయమేస్తోంది. కానీ ఒకప్పుడు పొద్దున్నే లేచి చన్నీళ్లతో స్నానం చేసేవారు. ప్రస్తుతం చాలా మంది చన్నీళ్లకు భయపడి.. వేడి నీళ్లతో స్నానం కానిచ్చేస్తున్నారు. కానీ ఆరోగ్యానికి వేడి నీళ్ల స్నానం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చన్నీళ్లే ఉత్తమం అని పేర్కొంటున్నారు. వేడి […]

Health Tips | ఓ వైపు చలి చంపేస్తుంది. మరో వైపు నీళ్లు కూడా చల్లగా ఉంటున్నాయి. పొద్దున, సాయంత్రం వేళల్లో నీటిని ముట్టుకోవాలంటే చేతులు వణికిపోతున్నాయి. చన్నీళ్లతో స్నానం చేయాలంటేనే భయమేస్తోంది. కానీ ఒకప్పుడు పొద్దున్నే లేచి చన్నీళ్లతో స్నానం చేసేవారు. ప్రస్తుతం చాలా మంది చన్నీళ్లకు భయపడి.. వేడి నీళ్లతో స్నానం కానిచ్చేస్తున్నారు. కానీ ఆరోగ్యానికి వేడి నీళ్ల స్నానం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చన్నీళ్లే ఉత్తమం అని పేర్కొంటున్నారు.
వేడి వేడి నీటితో స్నానం చేస్తే శరీరమంతా హాయిగా అనిపిస్తుంది. కానీ వేడి నీళ్లతో స్నానం చేయడం మంచిది కాదంటున్నారు నిపుణులు. హాట్ వాటర్‌తో స్నానం చేసినప్పుడు బాడీ అంతా రిలాక్స్ అవుతుంది. కానీ దీని వల్ల మత్తు మత్తుగా, నిద్ర వచ్చినట్లుగా ఉంటుంది. అలసట కూడా వచ్చేస్తుంది. దీంతో ఆఫీసులకు, పనులకు వెళ్లిన వారు ఇబ్బందిగా ఫీలవుతుంటారని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.
మరి చన్నీళ్లతో స్నానం చేస్తే ఈ సమస్యలు ఉండవని తెలుపుతున్నారు ఆరోగ్య నిపుణులు. చన్నీళ్లతో స్నానం చేసేటప్పుడు.. మొదట ఇబ్బందిగా అనిపించినా ఒంటిపై చన్నీళ్లు పడగానే శరీరం మొత్తం ఉత్తేజితమవుతుంది. దెబ్బకు నిద్రమత్తు వదిలిపోతుంది. రోజంతా యాక్టివ్‌గా ఉండగలుగుతారు. అందుకే వేడినీళ్ల కంటే చన్నీళ్లతో స్నానం చేయడమే మంచిదని అంటున్నారు. అంతేకాదు చన్నీళ్ల స్నానం చేయడం వల్ల ముఖ అందం కూడా రెట్టింపు అవుతుందంట.
వేడి నీటి స్నానం ఎప్పుడు మంచిది?
రాత్రిపూట వేడినీటితో స్నానం చేయడం మంచిది. గోరువెచ్చటి నీటితో స్నానం చేయడం వల్ల శరీరం, కండరాలు మొత్తం రిలాక్స్ అవుతాయి. దీనివల్ల పొద్దుట్నుంచి పనిచేసి అలసిపోయిన శరీరానికి ఉపశమనం లభిస్తుంది. హాయిగా నిద్రపడుతుంది. కాబట్టి రాత్రిపూట మాత్రం చన్నీళ్ల కంటే వేడినీటితో స్నానం చేయడమే బెటర్.
వీరు జాగ్రత్తగా ఉండాలి
చన్నీళ్లతో స్నానం చేయడం అందరికీ మంచిది కాదు. కొంతమంది సైనస్, మైగ్రేన్ వంటి సమస్యలతో బాధపడేవారు ఉంటారు. చలికాలంలో చన్నీటితో స్నానం చేస్తే వారి సమస్య మరింత ఎక్కువ అవుతుంది. తలపట్టేసినట్టు ఉండటమే కాకుండా తలనొప్పి కూడా పెరుగుతుంది. కాబట్టి వాళ్లు చలికాలంలో వేడినీటితో స్నానం చేయడమే మంచిది. అదే వేసవి కాలంలో వాతావరణం వేడిగా ఉంటుంది కాబట్టి ఎవరైనా చన్నీటితో స్నానం చేయొచ్చు.