World Hypertension Day | హై బీపీ అకాల మరణాలకు దారి తీస్తుంది.. ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..
World Hypertension Day | హై బీపీ.. ఇది కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకంగా మారుతుంది. ప్రపంచంలో అకాల మరణాలకు హైబీపీ ఒక కారణం అని చెప్పొచ్చు. దీన్ని అధిక రక్తపోటు అని కూడా పిలుస్తారు. దీని బారిన పడితే జీవితాంతం మందులు వాడాల్సిందే. బ్రెయిన్ స్ట్రోక్, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు అధిక రక్తపోటు కారణంగానే సంభవిస్తాయి. కాబట్టి అధిక రక్తపోటు వచ్చాక అదుపులో ఉంచుకోవడం కన్నా రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని వైద్య నిపుణులు […]

World Hypertension Day | హై బీపీ.. ఇది కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకంగా మారుతుంది. ప్రపంచంలో అకాల మరణాలకు హైబీపీ ఒక కారణం అని చెప్పొచ్చు. దీన్ని అధిక రక్తపోటు అని కూడా పిలుస్తారు. దీని బారిన పడితే జీవితాంతం మందులు వాడాల్సిందే.
బ్రెయిన్ స్ట్రోక్, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు అధిక రక్తపోటు కారణంగానే సంభవిస్తాయి. కాబట్టి అధిక రక్తపోటు వచ్చాక అదుపులో ఉంచుకోవడం కన్నా రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ప్రతి ఏడాది మే 17వ తేదీన వరల్డ్ హైపర్ టెన్షన్ డేగా నిర్వహిస్తారు.
మన దేశంలోనే 220 మిలియన్ల కంటే ఎక్కువ మంది హైబీపీ బారిన పడినట్టు అంచనా. అధిక రక్తపోటు బారిన పడకుండా ఎలా ఉండాలి? అధిక రక్తపోటు వచ్చాక ప్రాణాంతక పరిస్థితులు రాకుండా ఎలా చూసుకోవాలి? అనే అవగాహనను కల్పించడం కోసం ఈ ప్రత్యేక దినోత్సవాన్ని నిర్వహిస్తారు.
ప్రజలు రక్తపోటు లక్షణాలను తెలుసుకోవడంతో పాటు చికిత్సలపై కూడా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. తరచూ హెల్త్ చెకప్‌లు తీసుకుంటే రక్తపోటు ముందస్తు దశలోనే గుర్తించవచ్చు. దీనివల్ల మందులు అవసరం లేకుండా ఆహారము, వ్యాయామం ద్వారా అదుపులో ఉంచుకోవచ్చు.
అయితే హైబీపీ రావడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. ఆహార నియమాలు పాటించకపోవడం, చెడు వ్యసనాలకు బానిసగా మారడంతో అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉంది. అంతే కాకుండా వారసత్వంగా కూడా హైబీపీ వచ్చే అవకాశం ఉంది. ఇక వయసు పైబడిన వారిలో కూడా హైబీపీ వస్తుంది. మరి ముఖ్యంగా ఆహారం తినకుండా.. తీవ్ర ఒత్తిడికి గురయ్యే వారిలో అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఎక్కువ అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తీవ్ర ఒత్తిడికి గురవడం, విపరీతమైన ధూమపానం చేయడం, మద్యం సేవించడం, శారీరక శ్రమ లేకపోవడం, జంక్ ఫుడ్ అధికంగా తినడం, ఆరోగ్యానికి మేలు చేసే తాజా కూరగాయలు వంటివి తినకపోవడం, ఎక్కువగా స్క్రీన్ టైం పెరిగిపోవడం వంటివన్నీ కూడా అధిక రక్తపోటుకు కారణాలే. సకాలంలో చికిత్స అందించకపోతే గుండెపోటుకు కారణం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు ఏడాదికొకసారి రక్తపోటును చెక్ చేసుకోవడం చాలా అవసరం అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.