Maoist Surrender : తెలంగాణలో 41 మంది మావోయిస్టుల లొంగుబాటు

తెలంగాణ పోలీసుల సమక్షంలో 41 మంది మావోయిస్టులు లొంగిపోయారు. రాష్ట్ర చరిత్రలోనే ఇది అతిపెద్ద లొంగుబాటుగా డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు. వీరికి రూ.1.46 కోట్ల రివార్డును ప్రకటించారు.

Maoist Surrender : తెలంగాణలో 41 మంది మావోయిస్టుల లొంగుబాటు

హైదరాబాద్‌: వరుస ఎన్ కౌంటర్లు, లొంగుబాట్లు, అరెస్టుల పర్వంతో బలహీన పడుతున్న మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా తెలంగాణ డీజీపీ ఎదుట 41 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో కామారెడ్డికి చెందిన రాష్ట్ర కమిటీ కార్యదర్శి ఎర్రగొల్ల రవి ఎలియాస్‌ సంతోష్‌, మంచిర్యాలకు చెందిన కనికారపు ప్రభంజన్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఆరుగురు డివిజన్‌ కమిటీ సభ్యులు, ఇద్దరు సెంట్రల్‌ విజన్‌ కమాండర్లు ఉన్నారు. మిగతా మావోయిస్టులంతా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారిగా డీజీపీ శివధర్‌రెడ్డి పేర్కొన్నారు. మావోయిస్టుల వద్ద నుంచి 24 తుపాకులను, మందుగుండును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. వాటిలో ఒక INSAS LMG గన్స్, మూడు AK-47 రైఫిల్స్, ఐదు SLR రైఫిల్స్, ఏడు INSAS రైఫిల్స్, ఒక BGL గన్, నాలుగు UBGL తుపాకులు, ఒక 303 రైఫిల్, రెండు సింగిల్ షాట్ రైఫిల్స్, 24 ఎయిర్ గన్స్, 733 BGL షెల్స్, 08 షెల్స్ ఉన్నాయి.

రూ.1.46 కోట్ల నగదు రివార్డు పంపిణీ

ఎర్రగొల్ల రవి(DVCM) 24 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉంగా..కోర్సా లచ్చు(CYPCM) 21 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్నారు. మొత్తం 41 మంది అజ్ఞాత మావోయిస్టు కేడర్లు పార్టీని విడిచిపెట్టి ప్రధాన జనజీవనంలో కలిశారు. ఈ చర్య రాష్ట్ర అభివృద్ధి, శాంతి భద్రతలు, ప్రజల సంక్షేమ కార్యక్రమాలకు బలాన్ని చేకూర్చే కీలక ముందడుగుగా భావిస్తున్నామని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. లొంగిపోయిన 41 మందికి కలిపి ప్రభుత్వం తరఫున మొత్తం రూ.1.46 కోట్ల నగదు బహుమతిని అందజేయనున్నట్లుగా తెలిపారు. తక్షణ సహాయం కింద ఒక్కొక్కరికి రూ.25 వేలు ఇవాళ పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. వాటితో పాటు ఆయుధాలకు విడిగా నగదు బహుమతిని కూడా ప్రభుత్వం అందిస్తుందని.. వాటిలో ఎల్ఎంజీ రైఫిల్‌కు రూ.5 లక్షలు, AK-472కు 4 లక్షలు ఇస్తామని వెల్లడించారు. మిగిలిన మావోయిస్టులు కూడా ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. లొంగిపోయిన వారకికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని భరోసానిచ్చారు.

బలహీన పడిన విప్లవోద్యమం..పెరిగిన నిర్బంధంతోనే లొంగుబాట

విప్లవోద్యమం బలహీన పడడటం..పార్టీ నాయకత్వంపై అసంతృప్తి, క్షేత్రస్థాయి కేడర్లను కొత్త ప్రాంతాలకు పంపడం, స్థానిక ప్రజల మద్దతు కరువవ్వడం, పోలీసుల ఒత్తిడి కారణంగా తాము అజ్ఞాతం వదిలి బయటకు రావాలని నిర్ణయించుకున్నట్లుగా మావోయిస్టులు తెలిపారు. అలాగే ప్రభుత్వ పునరావాస పథకాలపైన నమ్మకం కూడా తమను జనజీవనం స్రవంతిలోకి వచ్చేలా చేశాయని వారు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి :

Akhanda 2 | వారణాసిలో ‘అఖండ 2’ ప్రమోషన్స్…బాల‌య్య‌తో సెల్ఫీల కోసం ఎగ‌బడ్డ ఉత్త‌రాది ప్ర‌జ‌లు
Harish Rao : పేద విద్యార్థిని వైద్య విద్య ఫీజు కోసం..సొంత ఇంటిని తనఖా పెట్టిన హరీష్ రావు