తెలంగాణలో అక్రమాస్తుల కేసులో అరెస్టైన ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరికి చెందిన లాకర్లను ఏసీబీ అధికారులు శనివారం తెరిచారు. నోట్ల కట్టలతో నిండి ఉన్న లాకర్లను చూసి అధికారుల షాక్ అయ్యారు. వాటిలోని రూ.1.5 కోట్లను సీజ్ చేశారు. ఆ నోట్ల కట్టలతో ఓ భారీ టేబుల్ నిండిపోయింది. ఏసీబీ చరిత్రలోనే భారీ నగదు స్వాధీనాలలో ఇది ఒకటని వెల్లడించారు. బ్యాంక్ అకౌంట్స్ లో ఉన్న 5కోట్లు సీజ్ చేశారు.ఇంకా మరో రెండు లాకర్లు తెరవాల్సి ఉండటం గమనార్హం.
ఇటీవల నరహరి ఇళ్లలో సోదాలు చేసి భారీగా ఆస్తులు గుర్తించారు. ఇంట్లో మంచం కింద, ఇతర ప్రాంతాల్లో ఇప్పటికే దొరికిన కోటిన్నర నగదు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లో పలు బిల్డింగులతో పాటు బ్యాంకుల్లోని రూ.5 కోట్ల విలువైన ఫిక్స్ డ్ డిపాజిట్లు, ఖాతాలో రూ.2.29కోట్లు, 1.3కిలోల బంగారం, 8కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటిదాక నరహరి నివాసాలపై జరిపిన సోదాలలో గుర్తించిన ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్ లో రూ.150కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేయడం విశేషం.
హైదరాబాద్ భూసర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి రావు లాకర్ల నుంచి ఈరోజు ఏసీబీ అధికారులు రూ.1.50 కోట్ల నగదు స్వాధీనం చేసుకుంది. ఇప్పటికే రూ.13.05 కోట్ల అక్రమాస్తులు సీజ్ చేసిన అధికారులు, అతనికి ఇప్పటికే 14 రోజుల రిమాండ్ విధించారు. https://t.co/f4dEJEEtkq pic.twitter.com/mJu8gA04FU
— TG Govt Updates (@TGGovtUpdates) June 20, 2026
