బండి భగీరథ్ కేసులో మరిన్ని ట్విస్టులు !

బండి భగీరథ్ పోక్సో కేసులో కొత్త ట్విస్టులు చోటుచేసుకున్నాయి. తన పేరు వాడొద్దంటూ బండి సంజయ్ కోర్టును ఆశ్రయించగా, బాలిక వివరాలు ప్రచారం చేసిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

బండి భగీరథ్ కేసులో మరిన్ని ట్విస్టులు !

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ కేసు మరిన్ని మలుపులు తీసుకుంది. కేసులో తన పేరు వాడవద్దని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ సిటీ సివిల్‌ కోర్టును ఆశ్రయించారు. పోక్సో కేసులో భవిష్యత్తులో తన పేరు వాడొద్దని పిటిషన్‌ వేశారు. తన పేరుతో ఇప్పటి వరకు వాడిన వీడియోలు తొలగించాలని న్యాయస్థానాన్ని కోరారు.

మరోవైపు బండి భగీరథ్‌ కేసులో బాలిక వివరాలు సోషల్‌ మీడియాలో ప్రసారం కావడంపై పేట్ బషీరాబాద్‌ పోలీసులు సీరియస్ అయ్యారు. మేడ్చల్‌ జిల్లా బాలల సంక్షేమ కమిటీ ఛైర్‌పర్సన్‌ ఫిర్యాదు మేరకు సోషల్‌ మీడియా నిర్వాహకులపై కేసులు పెట్టినట్లు పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు తెలిపారు. బాతురాలు, తల్లిదండ్రుల ఫోటోలు,వీడియోలను పోస్ట్ చేసిన వారిపై కేసులు నమోదు చేశారు. ఇన్ స్ట్రా, ఫేస్ బుక్ ఖాతాల ఐడీలు, యూఆర్ఎల్ లు గుర్తించి పోలీసులు జువైనల్ యాక్ట్, బీఎంఎస్ ఫోక్సో సెక్షన్ల కింద కేసులు పెట్టినట్లుగా వెల్లడించారు.

ఇవి కూడా చదవండి :

నీట్ పరీక్షలపై మరో కీలక అప్‌డేట్‌.. ఇకపై మారనున్న పరీక్షా విధానం.. లీకేజీలు తగ్గేనా?
యూపీలో గాలి వాన బీభత్సవానికి 113 మంది బలి!