Jubilee Hills By-Poll | జూబ్లీహిల్స్ డివిజన్లలో ప్రచారానికి మంత్రుల నియామకం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం కోసం సీఎం రేవంత్ రెడ్డి మంత్రులను డివిజన్ వారీగా ప్రచార బాధ్యతలు అప్పగించారు.
విధాత, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం కోసం ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి డివిజన్ల వారిగా మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. రహమత్ నగర్ డివిజన్ కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలను నియమించారు. బోరబండ డివిజన్ – సీతక్క, మల్లు రవి,
వెంగల్ రావు నగర్ డివిజన్- తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరిలు, సోమాజిగూడ డివిజన్- శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్ లను నియమించారు. షేక్ పేట డివిజన్- కొండా సురేఖ, వివేక్ లు, ఎర్రగడ్డ డివిజన్- దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణరావులను నియమించారు. యూసఫ్ గూడ డివిజన్ కు – ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ లను నియమించారు.
రేవంత్ రెడ్డి ఈ నెల 31 వ తేదీ ఉదయం 7గంటలకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వెంగళరావు నగర్ లో , రాత్రి 8గంటలకు సోమాజిగూడలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. నవంబర్ 1వ తేదీ ఉదయం ఏడు గంటలకు వెంగళరావునగర్ సోమాజిగూడలలో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు నవంబర్ 1న ఉదయం బోరబండలో, రాత్రి 8 గంటలకు ఎర్రగడ్డలో, 4వ తేదీన ఉదయం షేక్ పేట 1డివిజన్ లో, రాత్రి రహమత్ నగర్ లో ప్రచారం చేస్తారు. 5వ తేదీన ఉదయం షేక్ పేట 2లో, సాయంత్రం యూసఫ్ గూడలో, 8వ తేదీన ఆరు డివిజన్లలో మోటార్ సైకిల్ ర్యాలీలో పాల్గొంటారు. 9వ తేదీన షేక్ పేటలో ఉదయం 10గంటలకు మోటార్ సైకిల్ ర్యాలీలో పాల్గొని ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram