Chaderghat police shooting| చాదర్ ఘాట్ లో కాల్పుల కలకలం
హైదరాబాద్ చాదర్ ఘాట్ లో పోలీసు కాల్పులు కలకలం రేపాయి. చాదర్‌ఘాట్‌లోని విక్టరీ గ్రౌండ్‌లో సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్యపైన దొంగ దాడికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో డీసీసీ చైతన్య దొంగపై కాల్పులు జరిపాడు.
విధాత, హైదరాబాద్ :
హైదరాబాద్ లో పోలీసుల కాల్పులు కలకలం రేపాయి. చాదర్ ఘాట్ ప్లే గ్రౌండ్ దగ్గర ఇద్దరు దొంగలు సెల్ ఫోన్ చేసి పారిపోతున్నారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య, ఆయన గన్‌మెన్ గమనించి పట్టుకునేందుకు ప్రయత్నం చేశారు. ఈ సమయంలో గన్ మెన్ పైన దొంగలు కత్తితో దాడి చేసేందుకు యత్నించగా గన్ మెన్ కిందపడిపోయి దెబ్బలు తగిలాయి. దీంతో డీసీపీ చైతన్య దొంగలపైకి కాల్పులు జరిపారు. రెండు రౌండ్ల ఫైరింగ్ లో ఓ దొంగ గాయపడగా మరొకరు పారిపోయారు. కాల్పుల్లో దొంగ చేతికి, కడుపుకు బుల్లెట్ గాయాలయ్యాయి. ఘటనలో గాయపడ్డ దొంగను వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. ఈ తోపులాటలో డీసీపీతో పాటు, గన్ మెన్ లు కిందపడడంతో వారికి స్వల్ప గాయాలయ్యాయి.
ఇటీవల నిజమాబాద్ లో ప్రమోద్ అనే కానిస్టేబుల్ పై రౌడీషీటర్ రియాజ్ కత్తితో దాడి చేసిన ఘటనలో కానిస్టేబుల్ చనిపోగా, మరో ఏఎస్ఐకి గాయాలయ్యాయి. అనంతరం రియాజ్ ను పోలీసులు అరెస్టు చేయడం..అతను ఆసుపత్రి నుంచి తప్పించుకునే క్రమంలో పోలీసుల గన్ లాక్కుని దాడికి ప్రయత్నించడం జరిగింది. ఈ సందర్భంగా పోలీసులు జరిపి కాల్పుల్లో రియాజ్ హతమవ్వడం తెలిసిందే. ఈ ఘటన మరువకముందే మరోసారి పోలీసులపై దాడి ఘటన పునరావృతం కావడం గమనార్హం.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram