అత్యవసర వైద్య చికిత్స కోసం హైదరాబాద్ మెట్రో గ్రీన్ ఛానెల్‌ను ఏర్పాటు చేసి అవయవాలను తరలించడంలో మరోసారి ప్రశంసనీయ పాత్ర పోషించింది. గచ్చిబౌలి కేర్ ఆస్పత్రి (రాయదుర్గం మెట్రో స్టేషన్)నుంచి సికింద్రాబాద్ కిమ్స్ (రసూల్‌పురా మెట్రో స్టేషన్)కు గుండె, ఊపిరితిత్తుల తరలింపునకు గ్రీన్ ఛానెల్ ఏర్పాటుతో మెట్రో రైలు అధికారులు సహకరించారు.
14 కి.మీ దూరంలోని కిమ్స్‌కు 25 నిమిషాల్లోనే వాటిని చేర్చారు. అత్యవసర ఆరోగ్య కార్యక్రమాలకు మెట్రో మద్దతు ఇస్తోందని ఈ సందర్బంగా అధికారులు తెలిపారు. ప్రాణాలను కాపాడే వైద్య చర్యలకు హైదరాబాద్ మెట్రో సహకారం ఉంటుందన్నారు.
మరిన్ని చదవండి :