స్నేహితులను భయపెట్టాలనుకుని.. పాము కాటుతో వ్యక్తి మృతి

సరదగా స్నేహితులను పాముతో భయపెట్టాలనుకున్న ఓ యువ వ్యాపార వేత్త అనూహ్యంగా ఆ పాము కాటుకు బలైన ఘటన విషాదం మిగిల్చింది.

సరదగా స్నేహితులను పాముతో భయపెట్టాలనుకున్న ఓ యువ వ్యాపార వేత్త అనూహ్యంగా ఆ పాము కాటుకు బలైన ఘటన విషాదం మిగిల్చింది. హైదరాబాద్ రాజేంద్రనగర్‌కు చెందిన యువ వ్యాపారవేత్త మొహిద్దీన్(30) మొయినాబాద్ ఫామ్‌హౌస్‌‌కు స్నేహితులతో కలిసి వెళ్లారు.

అక్కడ కనిపించిన కట్ల పామును చేతితో పట్టుకుని స్నేహితులను భయపెట్టే ప్రయత్నం చేయబోయాడు. అంతలోనే ఆ కట్ల పాము మొహిద్దిన్ ను చేతిపై కాటు వేసిది. అది చిన్న పాము అని, దాని కాటుకు నాకు ఏం కాదులే అంటూ స్నేహితులు ఆసుపత్రికి వెలుదామని చెప్పినా నిర్లక్ష్యం ప్రదర్శించాడు.

గంట తర్వతా మొహిద్దీన్ శరీరం అంతటికి విషం పాకి తీవ్ర అస్వస్థతకు గురవ్వగా, వెంటనే అతడిని ఆస్పత్రి తరలించారు. అప్పటికే శరీరం అంతటికి విషం వ్యాప్తి చెందడంతో అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో సరదా కోసం చేసిన పాము ఆట కాస్తా.. దాని కాటుతో ప్రాణం పోగొట్టుకోవాల్సి వచ్చిందంటూ స్నేహితులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.

 

Latest News