మూసీపై నా పిటీషన్ డిస్పోజ్ మాత్రమే : బీఆర్ఎస్ నేత కార్తీక్ రెడ్డి

మూసీ సుందరీకరణపై వేసిన పిటిషన్‌ను ఎన్జీటీ డిస్మిస్ చేయలేదని, కేవలం డిస్పోజ్ మాత్రమే చేసిందని బీఆర్ఎస్ నేత కార్తీక్ రెడ్డి స్పష్టం చేశారు.

Patolla Karthik Reddy

విధాత, హైదరాబాద్ : మూసీ సుందరీకరణపై అభ్యంతరాలను లేవనెత్తుతూ నేను వేసిన కేసును ఎన్జీటీ డిస్మిస్ చేయలేదని.. డిస్పోజ్ చేసింది అని బీఆర్ఎస్ నేత పటోళ్ల కార్తీక్ రెడ్డి వెల్లడించారు. మూసీ సుందరీకరణ పనుల ప్రగతి అంతా దరఖాస్తు(ప్రారంభ) దశలోనే ఉన్నాయని ప్రభుత్వం ఎన్జీటీకి చెప్పిందని, వాటన్నింటిపై స్పష్టత తీసుకున్న తర్వాతే ముందుకెళ్తామని ప్రభుత్వం ఎన్జీటీకి
చెప్పింది అని గుర్తు చేశారు. మూసీ నిర్వాసితులకు సహాయ, పునరావాసాలను ప్రభుత్వం చేస్తామంటోందని… చేయకపోతే మళ్లీ రావాలని ఎన్జీటీ సూచించిందని తెలిపారు.

అసెంబ్లీలో చెప్పని వాటిని కూడా చేస్తామని ఎన్జీటీ ముందు ప్రభుత్వంచే చెప్పించామని, కోర్టుకు చెప్పిన వాటిలో ప్రభుత్వం ఏ ఒక్క అంశం చేయకపోయినా మళ్లీ న్యాయస్థానానికి వెళ్తానని పటోళ్ల వెల్లడించారు. రాష్ట్రం కోసం, ప్రజల కోసం ముఖ్యమంత్రి మూసీ ప్రాజెక్టు చేయడం లేదు అని, తన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం మాత్రమే మూసీ సుందరీకరణ చేపట్టారని విమర్శించారు.
నరేంద్ర మోదీ సబర్మతి రివర్ ఫ్రంట్ చేసిన విధంగా తన పరపతి పెంచుకునేందుకు రేవంత్ రెడ్డి మూసీ ప్రాజెక్టు చేపడుతున్నారని ఆరోపించారు. ప్రజల కోణంలో పనులు చేయకపోతే మూసీ ప్రాజెక్టును అడ్డుకొని తీరతాం అని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి :

మూసీ నిర్వాసితుల కోసం బీఆర్ఎస్వీ పోరుబాట
త్వరలోనే.. తెలంగాణ కేబినెట్ లో భారీ మార్పులు !

Latest News