మూసీ నిర్వాసితుల కోసం బీఆర్ఎస్వీ పోరుబాట

మూసీ నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్వీ పోరుబాట యాత్ర ప్రారంభం. 10 రోజుల పాటు బృందాలు పర్యటించి బాధితులకు భరోసా కల్పించనున్నాయి.

మూసీ నిర్వాసితుల కోసం బీఆర్ఎస్వీ పోరుబాట

విధాత, హైదరాబాద్ : మూసీ నిర్వాసితు సమస్యల సాధనకు భారత రాష్ట్ర సమితి విద్యార్ధి విభాగం (బీఆర్ఎస్వీ )తల పెట్టిన మూసీ పోరుబాట యాత్ర శనివారం తెలంగాణ భవన్ నుంచి ప్రారంభమైంది. మాజీ మంత్రి ,బీ ఆర్ ఎస్ ఎల్పీ ఉపనాయకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ యాత్ర ప్రత్యేక వాహనాలకు జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బీఆర్ఎస్వీ కార్యకర్తలు పది రోజుల పాటు జరిగే యాత్రలో 50 బృందాలు గా విడిపోయి మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు భరోసా ఇవ్వనున్నారు.

ఈ సందర్బంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ మూసీ సుందరీకరణ పేరిట పేదల పై రేవంత్ ప్రభుత్వం జరుపుతున్న దమనకాండ పై పోరాడేందుకు విద్యార్థులు నడుం బిగించడం హర్షించదగ్గ విషయమని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు మూసీపై తమ కార్యాచరణ కొనసాగుతుందని బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం లో బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్ రెడ్డి , బీ ఆర్ఎస్వీ ఉపాధ్యక్షులు తుంగ బాలు , కడారి స్వామి యాదవ్ , విద్యార్థి విభాగం నేతలు పాల్గొన్నారు .

ఇవి కూడా చదవండి :

త్వరలోనే.. తెలంగాణ కేబినెట్ లో భారీ మార్పులు !
బావిలోకి దూసుకెళ్లిన కారు.. తొమ్మిది మంది మృతి