హైదరాబాద్ : మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి హైకోర్టు కండీషనల్ బెయిల్ మంజూరు చేసింది. చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న రోహిత్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసిన కోర్డు..వారంలో ఒకరోజు దర్యాప్తు అధికారి ముందు హాజరుకావాలని షరతు విధించింది. అలాగే
పాస్ పోర్టును పోలీసులకు సరెండర్ చేయాలని ఆదేశించింది. దర్యాప్తునకు సహకరించాలని, సాక్ష్యులను ప్రభావితం చేయవద్దని కోరింది.
మార్చి 14న రాత్రి మొయినాబాద్‌లో రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌పై పోలీసులు దాడి చేశారు. పార్టీలో డ్రగ్స్, మద్యం తీసుకున్నారన్న అభియోగాలతో పాటు పోలీసులపై ఫామ్ హౌస్లో కాల్పులు జరిపినట్లుగా పైలట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు, సహా 11మందిపై కేసు నమోదైంది. 11 మంది నిందితులలో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి, సోదరుడు రితేష్‌రెడ్డి, ప్రధాన నిందితుడు నమిత్‌శర్మలను రిమాండ్ చేయగా.. మిగిలిన వారికి నోటీసులతో సరిపెట్టారు.
ఇవి కూడా చదవండి :
మా ఫోన్లు, సీసీ కెమెరాలను హ్యాక్ చేస్తున్నారు : హరీశ్ రావు సంచలన ఆరోపణలు
రాజకీయ, నిర్మాణ, పోరాట కర్తవ్యాలు.. బీఆర్ఎస్ త్రిముఖ వ్యూహం
