Hyderabad : కారులో రూ.4కోట్ల హవాలా నగదు..సినీ ఫక్కిలో ఛేజ్ చేసిన పోలీసులు

శామీర్‌పేటలో కారులో రూ.4కోట్ల హవాలా నగదు తరలిస్తుండగా బోయినపల్లి పోలీసులు సినీ ఫక్కీలో ఛేజ్ చేసి ముఠాను అదుపులోకి తీసుకున్నారు.

Hyderabad : కారులో రూ.4కోట్ల హవాలా నగదు..సినీ ఫక్కిలో ఛేజ్ చేసిన పోలీసులు

విధాత: పుష్ప 2 సినిమా తరహాలో కారులో రూ.4కోట్ల హవాలా నగదును తరలిస్తుండగా..పోలీసులు పట్టుకొన్న ఘటన వైరల్ గా మారింది. శామీర్‌పేటలో ఓ కారులో భారీగా హవాలా నగదు తరలిస్తున్నారన్న సమాచారంతో బోయినపల్లి పోలీసులు కారును పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. అయితే ముఠా సభ్యులు పారిపోవడానికి ప్రయత్నించడంతో వారిని సినీ ఫక్కీలో 15కిలో మీటర్లు ఛేజింగ్ చేసి మరి పట్టుకున్నారు.

కారు డిక్కీ, టైరు, సీట్ల కింద డబ్బు కట్టలు దాచి తరలిస్తున్నట్లుగా గుర్తించారు. మొత్తం రూ.4 కోట్ల హవాలా నగదును పట్టుకున్నారు. అక్రమ నగదును తరలిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై పోలీసులు ఏడాదిగా నిఘా ఉంచినట్లుగా తెలిపారు.

ఇవి కూడా చదవండి :

Nirmala Sitharaman : బెంగాల్ నుంచి బాగో బాగ్
Medaram Jathara | మేడారం ఆదివాసీ గిరిజన మహాజాతర.. జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు