రిటైర్ ఐపీఎస్ భార్య హత్య
హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఐఏఎస్, ఐపీఎస్ క్వార్టర్స్ లో ఉంటున్న విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్‍రే భార్య సునంద దారుణ హత్యకు గురయ్యారు
విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రశాసన్‌నగర్‌లోని ఐఏఎస్, ఐపీఎస్ క్వార్టర్స్ లో ఉంటున్న విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్‍రే భార్య సునంద(55) దారుణ హత్యకు గురయ్యారు. సునందను ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఇంటి పనిమనిషి హత్య చేసి..ఇంట్లోని నగలు, నగదుతో పారిపోయినట్లుగా సమాచారం. ఇంట్లో విగతజీవిగా పడి ఉన్న రంజన్‍రే భార్యను చూసిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు.
డబ్బుల కోసం సునందను నేపాల్ కు చెందిన పనిమనిషి కల్పన గొంతు నులిమి హత్య చేసినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్య నేపాల్ గ్యాంగ్ పనే అని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు.
ఘటన స్థలానికి చేరుకున్న సీపీ సజ్జనార్ కేసు దర్యాప్తును పరిశీలించారు. నిందితుల కోసం నాలుగు బృందాలు ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. చోరీ ఉద్దేశంతోనే ఈ హత్య జరిగిందా లేక మరేదైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram