27ఏళ్ల కుర్రోడు.. 7వేల కోట్లు విరాళం

విధాత‌: కరోనా మహమ్మారిపై యుద్థం చేస్తోన్న భారత్ కు ఎథీరియం(క్రిప్టో కరెన్సీ ఫ్లాట్ ఫాం) సహ వ్యవస్థాపకుడు విటాలిన్‌ బుటెరిన్‌(27) భారీ సాయం ప్రకటించాడు. భారతదేశ కోవిడ్‌ రిలీఫ్‌ కోసం 1.1బిలియన్ డాలర్ల విలువ చేసే క్రిప్టో కరెన్సీని విరాళంగా ఇచ్చాడు రష్యాకు చెందిన విటాలిన్ బుటెరిన్. 500 ఈథర్ నాణేలు మరియు 50 ట్రిలియన్స్ కు పైగా షిబాఇను కాయిన్స్ ని బుటెరిన్ విరాళంగా ఇచ్చారు. ఈ రెండూ ఎథీరియం నెట్‌ వర్క్ లో నిర్మించిన […]

27ఏళ్ల కుర్రోడు.. 7వేల కోట్లు విరాళం

విధాత‌: కరోనా మహమ్మారిపై యుద్థం చేస్తోన్న భారత్ కు ఎథీరియం(క్రిప్టో కరెన్సీ ఫ్లాట్ ఫాం) సహ వ్యవస్థాపకుడు విటాలిన్‌ బుటెరిన్‌(27) భారీ సాయం ప్రకటించాడు. భారతదేశ కోవిడ్‌ రిలీఫ్‌ కోసం 1.1బిలియన్ డాలర్ల విలువ చేసే క్రిప్టో కరెన్సీని విరాళంగా ఇచ్చాడు రష్యాకు చెందిన విటాలిన్ బుటెరిన్. 500 ఈథర్ నాణేలు మరియు 50 ట్రిలియన్స్ కు పైగా షిబాఇను కాయిన్స్ ని బుటెరిన్ విరాళంగా ఇచ్చారు. ఈ రెండూ ఎథీరియం నెట్‌ వర్క్ లో నిర్మించిన క్రిప్టోకరెన్సీలు. బుటెరిన్‌ ప్రకటించిన భారీ విరాళంకు.. నెటిజన్స్‌ ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇది “మదర్ ఆఫ్ ఆల్ డొనేషన్స్”అంటూ థ్యాంక్స్‌ చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.

బిట్‌కాయిన్ తరువాత ప్రపంచంలో రెండవ అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ఎథీరియం. మే-10న ఈథర్ ధర 3వేల డాలర్లకు చేరుకున్నప్పుడు బుటెరిన్ నికర విలువ 21 బిలియన్ల డాలర్లుగా ఉంది. ఈథర్ క్రిప్టోకరెన్సీ మార్కెట్ క్యాప్ 376 బిలియన్ డాలర్లుకుపై మాటే. ఈ సంవత్సరం ప్రారంభం నుండి ఈథర్ విలువ 325 శాతానికి పైగా పుంజుకోవడం విశేషం. దీంతో గత నెలలో ప్రపంచంలోనే 27 ఏళ్ల వయసులో అతి పిన్న వయస్కుడైన క్రిప్టో బిలియనీర్‌గా విటాలిక్ బుటెరిన్ అవతరించిన సంగతి తెలిసిందే.

అయితే, బుధవారం బుటెరిన్ ఇంత భారీగా డిజిటల్‌ కరెన్సీని విరాళంగా ప్రకటించడం కొంతమంది పెట్టుబడిదారులలో భయాందోళనలకు దారితీసింది. ఫలితంగా కొన్నిగంటల్లోనే షిబాఇను ధర 35శాతం పైగా పడిపోయింది. తాజాగా నష్టాల నుంచి రికవరీ కావటం గమనార్హం. ఈ క్రిప్టో కరెన్సీ డిజిటల్ కరెన్సీ కిందకే వస్తోంది. ఈ డిజిటల్ కరెన్సీ కేంద్రం లేదా ఆయా దేశాల కేంద్ర బ్యాంకుల నియంత్రణలో ఉంటుంది. డిజిటల్ కరెన్సీ నిర్వహణ బాధ్యతను ఇవి చూసుకుంటాయి.

అయితే ఇక్కడ క్రిప్టోకరెన్సీల విషయానికి వస్తే.. వీటిపై ఎవరి నియంత్రణ ఉండదు. డీసెంట్రలైజ్డ్ సిస్టమ్ ద్వారా పనిచేస్తాయి. క్రిప్టోకరెన్సీల విలువ డిమాండ్, సరఫరా ఆధారంగా మారుతూ ఉంటుంది. బ్లాక్‌చైయిన్ టెక్నాలజీ ఆధారంగా క్రిప్టోకరెన్సీలు పనిచేస్తాయి. ఈ క్రిప్టో కరెన్సీ ప్రభుత్వ ఖాతాలోకి విరాళం రూపంలో ఎలా జమ అవుతుందన్నది ఇప్పుడు అసలుసిసలు ప్రశ్న.