Alien Documentary| ఎలియన్స్ ఉన్నారా?..న్యూయార్క్ పోస్ట్ వైరల్ !
అంతరిక్ష ప్రపంచంలో భూగ్రహం వంటి జీవరాశి ఉనికి ఉన్న గ్రహాలు ఇంకేమైనా ఉన్నాయా..ఉంటే అక్కడి గ్రహంతర జీవులు ఎలా జీవిస్తున్నారన్న ప్రశ్నలు చాల ఏళ్లుగా మానవ జాతికి సవాల్ విసురుతున్నాయి. తాజాగా న్యూయార్క్ పోస్ట్ విడుదల చేసిన ఓ డాక్యుమెంటరీ గ్రహాంతర జీవులకు సంబంధించిన సమాచారంపై మరోసారి ఆసక్తి రేపింది.
న్యూఢిల్లీ : అనేక గ్రహాల(many planets)తో నిండిన విశ్వం(universe)లో ఇప్పటిదాక జీవరాశి ఉనికి కేవలం భూమి(Earth)పై మాత్రమే ఉందన్నది శాస్త్రీయ సత్యం. అయితే అంతరిక్ష ప్రపంచంలో భూగ్రహం వంటి జీవరాశి ఉనికి ఉన్న గ్రహాలు ఇంకేమైనా ఉన్నాయా..ఉంటే అక్కడి గ్రహంతర జీవులు(Aliens) ఎలా జీవిస్తున్నారన్న ప్రశ్నలు చాల ఏళ్లుగా మానవ జాతికి సవాల్ విసురుతున్నాయి. మనం ఎలియన్స్ గా పిలుచుకునే గ్రహంతర వాసుల ఉనికి పై ఖచ్చితమైన సమాచారం ఇప్పటిదాక లేనప్పటికి ..ఏదో ఓ గ్రహంపై జీవరాశి మనుగడ ఉండవచ్చన్న అంచనాలు శాస్త్రవేత్తలను ఏళ్ల తరబడిగా పరిశోధనల దిశగా పురిగొల్పుతున్నాయి. అడపదడపా ఎగిరే పల్లాల(UFO)ను చూశామంటూ కథనాలు ఎలియన్స్ ఉనికిపై మరిన్ని ఊహాగానాలను రేపాయి. గ్రహంతర వాసుల సమాచారానికి సంబంధించి అనేక ఘటనలు తరుచూ చర్చల్లోకి వస్తూ..వారి ఉనికిపై ఆశలు రేపుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా న్యూయార్క్ పోస్ట్(New York Post) విడుదల చేసిన ఓ డాక్యుమెంటరీ(Alien Documentary) వైరల్ గా మారింది. గ్రహాంతర జీవులకు సంబంధించిన సమాచారం అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ సీనియర్(George Bush Senior)కు తెలుసని ఆ డాక్యుమెంటరీలో ప్రస్తావించింది. 1964లో న్యూమెక్సికోలోని హోలోమన్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లోని సిబ్బంది గ్రహాంతరవాసులను ప్రత్యక్షంగా చూశారని న్యూయార్కు పోస్టు డాక్యుమెంటరీ కథనం.
అప్పుడు గ్రహంతర వాసులు భూమిపైకి వచ్చారు..
న్యూయార్క్ పోస్ట్ విడుదల చేసిన ‘ది ఏజ్ ఆఫ్ డిస్‌క్లోజర్’ అనే డాక్యుమెంటరీలో ఎరిక్ డేవిస్(Eric Davis) అనే ఖగోళ భౌతిక శాస్త్రవేత్త ఈ కథనాన్ని వెల్లడించారని పేర్కొంది. ఎరిక్ డేవిస్ 2003లో జార్జ్ బుష్ సీనియర్George Bush Senior,తో సమావేశమైనప్పుడు ఆయన స్వయంగా తనకీ విషయం చెప్పినట్లు పేర్కొన్నారు. మూడు అంతరిక్ష నౌకలు హోలోమన్ ఎయిర్ ఫోర్స్ బేస్ సమీపానికి వచ్చాయి. వాటిలో ఒకటి కిందకు దిగిందని.. అందులో నుంచి ఓ గ్రహాంతర వాసి కిందకు వచ్చి వైమానిక దళం సిబ్బందితో మాట్లాడడానికి ప్రయత్నించినట్లు అధికారులు జార్జ్ బుష్ సీనియర్‌కు సమాచారం ఇచ్చారని ఎరిక్ డేవిస్ వెల్లడించారు. జార్జ్ బుష్ సీనియర్ అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్(CIA) డైరెక్టర్‌గా ఉన్న సమయంలో (1976-77) గ్రహాంతరవాసులకు సంబంధించిన నివేదికను హోలోమన్ ఎయిర్ ఫోర్స్ బేస్ అధికారులు ఆయనకు అందించినట్లు న్యూయార్క్ పోస్ట్ నివేదిక పేర్కొంది. అయితే దీనికి సంబంధించిన భౌతిక ఆధారాలు ప్రస్తుతం అందుబాటులో లేవని తెలిపింది.
పూర్తి సమాచారం చెప్పలేదు
గ్రహంతర వాసుల ఉనికికి సంబంధించిన మిగితా విషయాలేవీ బుష్ తనతో చెప్పలేదని.. ఇతరులతోనూ చర్చించలేదని ఎరిక్ డేవిస్ వెల్లడించాడని డాక్యుమెంటరీలో పేర్కొంది. గ్రహాంతర వాసులకు సమీపంగా వెళ్లిన సిబ్బందికి కాలిన గాయాలు, అంతర్గత మచ్చలు ఏర్పడినట్లు స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో రోగనిరోధక శాస్త్రవేత్త, క్యాన్సర్ పరిశోధకుడు గ్యారీ నోలన్(Gary Nolan) నివేదికలో పేర్కొన్నారు. మొత్తంగా తాజా నివేదికతో గ్రహంతర వాసుల ఉనికిపై మరోసారి ఆసక్తికర చర్చకు తెరలేచినట్లయ్యింది. అయితే ఒకసారి భూమిపైకి వచ్చిన గ్రహంతర వాసులు మళ్లీ ఎందుకు రాలేదని..వచ్చిన వారు అమెరికాకే ఎందుకు వచ్చినట్లన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. స్పెస్ ఎక్స్ ప్రాజెక్టు నిర్వాహకుడు, ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ఏలియన్స్ లేవంటూ గతంలో స్పష్టం చేశాడు. ఏలియన్స్ అనే జీవులు ఏవీ భూమిపై కాలు పెట్టలేదని తేల్చేశాడు. కక్షలో స్పేస్ ఎక్స్‌కు చెందిన వేలాది బ్రాడ్ బ్యాండ్ స్పేస్ క్రాఫ్ట్‌లు ఉన్నాయని.. కానీ ఎప్పుడూ ఏలియన్స్ ఉనికి కనిపించలేదని కీలక వ్యాఖ్యలు చేశాడు. ఎవరైనా ఆధారాలు చూపిస్తే మాత్రం ఏలియన్స్‌పై ప్రయోగాలు చేసేందుకు తాను సిద్ధమని ప్రకటించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram