Trump: Stop Hiring Indians | భారతీయులకు ట్రంప్ మరో షాక్

Trump: Stop Hiring Indians | భారతీయులను నియమించుకోవద్ధంటూ టెక్ కంపెనీలకు వార్నింగ్
విధాత : అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత దేశంపై విద్వేషం ప్రదర్శిస్తున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trumph) తాజాగా మరోసారి భారతీయులపై విషం గక్కాడు. టెక్ కంపెనీలు భారతీయులను నియమించుకోవద్దంటూ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ సంస్థలు భారతీయులను నియమించుకోవద్దని..అమెరికా టెక్ సంస్థలు కూడా భారతీయులను తీసుకోవద్దని..టెక్ కంపెనీల గ్లోబలిస్ట్ మైండ్ సెట్ సరిగా లేదని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. బుధవారం వాషింగ్టన్ డీసీలో జరిగిన ఏఐ సదస్సులో ట్రంప్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. టెక్ కంపెనీల గ్లోబలిస్ట్ మైండ్‌సెట్‌ను ఆయన విమర్శించారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి భారీ టెక్ కంపెనీలు భారతీయులను నియమించుకోవడం ఆపి.. అమెరికన్లపై దృష్టిపెట్టాలని సూచించారు. చాలామంది అమెరికన్లు తమను పట్టించుకోవడం లేదన్న భావనలో ఉన్నట్లు పేర్కొన్నారు. దేశంలో లభించిన స్వేచ్ఛను వాడుకొని చాలా టెక్ కంపెనీలు ఇతర దేశాల్లో పెట్టుబడులు పెడుతున్నాయన్నారు. తన పాలనలో ఆ రోజులు ముగిసిపోతాయని చెప్పారు. టెక్ కంపెనీలు అమెరికన్లపై దృష్టి పెట్టాలని సూచించారు.
దేశంలోని చాలా భారీ టెక్ కంపెనీలు చైనాలో కంపెనీలు నిర్మిస్తూ.. భారతీయ ఉద్యోగులను నియమించుకొంటూ.. ఐర్లాండ్‌ను అడ్డంపెట్టుకొని తక్కువ లాభాలు చూపుతూ స్వేచ్ఛను అనుభవించాయని.. ఆ విషయం మీకు తెలుసని ట్రంప్ అన్నారు. అమెరికా ప్రజల అవకాశాలను పట్టించుకోకపోవడం, నిర్లక్ష్యం చేయడం వంటివి చేశారని ట్రంప్ ఆరోపించారు. ట్రంప్ పాలనలో ఆ రోజులు ముగిసిపోతాయని… ఏఐ రేసులో విజయం సాధించాలంటే సిలికాన్ వ్యాలీలో సరికొత్త దేశభక్తి అవసర అని.. ఇక్కడ ఉన్న టెక్నాలజీ కంపెనీలు మొత్తం అమెరికా కోసమేనని గుర్తెరుగాలన్నారు. దేశానికే మొదటి ప్రాధాన్యం ఇస్తూ పనిచేయాలని.. మీరూ అది చేయాలి.. అదే నేను కోరుతున్నాను’’ అని ట్రంప్ స్పష్టం చేశారు.