Kentucky cargo plane crash| ఇంజిన్ ఊడిపోయి కూలిన విమానం..వైరల్ గా ప్రమాద దృశ్యాలు
ఇటీవల విమాన ప్రమాదాలు జరుగుతున్న తీరు ఆశ్చర్యం రేపుతున్నాయి. తాజాగా అమెరికాలో ఓ విమానం గాల్లో ఉండగానే దానిలోని ఇంజిన్ ఊడిపోయి కూలిపోయిన ఘటన విస్మయం రేపింది.
న్యూఢిల్లీ: ఇటీవల విమాన ప్రమాదాలు జరుగుతున్న తీరు ఆశ్చర్యం రేపుతున్నాయి. తాజాగా అమెరికాలో ఓ విమానం(Plane Crash)గాల్లోఉండగానే దానిలోని ఇంజిన్ ఊడిపోయి(engine detaches mid-air) కూలిపోయిన ఘటన విస్మయం రేపింది. అమెరికాలోని కెంటకీలో ఇటీవల కార్గో విమానం కూలి(Kentucky cargo plane crash) 14 మంది దుర్మరణం చెందారు. విమానం కూలిపోతున్న సమయంలో రేగిన మంటల్లో నుంచి విమానం ఇంజిన్ ఎగిరిపడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. విమానం నుంచి ఇంజిన్ విడిపోవడంతోనే ప్రమాదం జరిగినట్లు దర్యాప్తు బృందం నిర్ధారించింది. నవంబరు 5న ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కార్గో విమానంలోని ముగ్గురు సిబ్బందితో పాటు కింద భూమిపై ఉన్న మరో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.
కెంటకీలోని లూయిస్‌విల్లే మహ్మద్ అలీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఈ కార్గో విమానం హొనోలులుకు బయల్దేరింది. టేకాఫ్ అవుతుండగా ఈ విమానం నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు పెరగడంతో విమానం కూలిపోయింది. ఫలితంగా ఎయిర్‌పోర్టులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. విమానం టేకాఫ్ అవుతుండగా దాని ఎడమవైపు రెక్క భాగంలోని ఇంజిన్ విడిపోవడం మొదలై.. కాసేపటికే విమానం నుంచి ఇంజిన్ ఊడి ఎగిరిపడింది. విమానం మంటల్లో ఇంజిన్ ఊడి పడుతున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. వాటిని దర్యాప్తు బృందం విడుదల చేసింది. ప్రమాద సమయంలో విమానం కేవలం భూమికి 30 అడుగుల ఎత్తులోనే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు. ప్రమాద సమయంలో కార్గో విమానంలో దాదాపు 2.8 లక్షల గ్యాలన్ల ఇంధనం ఉందని..దీంతో ప్రమాద తీవ్రత అధికమైందని దర్యాప్తు బృందం వెల్లడించింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram