Trump Tariffs | ట్రంప్‌కు షాక్‌.. అమెరికాపై యూర‌ప్ టారిఫ్‌ల బాదుడు

Trump Tariffs | ట్రంప్‌కు షాక్‌.. అమెరికాపై యూర‌ప్ టారిఫ్‌ల బాదుడు

Trump Tariffs | అమెరికా విధిస్తున్న ప్రతీకార టారిఫ్‌లతో వాణిజ్య యుద్ధం మొదలైపోయింది. ట్రంప్ విధించిన 104 శాతం సుంకాలకు కౌంటర్‌గా చైనా తన టారిఫ్‌లను 34 శాతం నుంచి 84 శాతానికి పెంచగా.. ఆ వెంటనే ఐరోపా దేశాలు సైతం అమెరికాకు భారీ షాక్ ఇచ్చాయి. అమెరికాపై పెనాల్టీలను 27 దేశాల ఐరోపా యూనియన్ ఆమోదించాయి. ఈ టారిఫ్‌లు ఏప్రిల్ నెల మధ్య నుంచి అమల్లోకి రానున్నాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌.. యూరోపియన్ యూనియన్ స్టీల్‌, అల్యూమినియం ఎగుమతులపై పై 25 శాతం టారిఫ్ విధించిన నేపథ్యంలో అమెరికా ఉత్పత్తులపై 21 బలియన్ యూరోల మేరకు (సుమారు 23.2 బిలియన్ డాలర్లు) సుంకాలు విధించేందుకు ఈయూ బుధవారం నిర్ణయం తీసుకున్నది. సోయాబీన్స్ ఉత్పత్తి చేసే లూసియానా, వజ్రాలు, వ్యవసాయ ఉత్పత్తులు, పౌల్ట్రీ, మోటర్ సైకిళ్లపై ఈ సుంకాలు వర్తించనున్నాయి.

వీటిలో చాలా వరకూ ఏప్రిల్ మధ్య నుంచి అమల్లోకి రానుండగా.. మరికొన్ని మే నెల మధ్యలో అమల్లోకి వస్తాయని తెలుస్తున్నది. దాని తర్వాత మూడో దఫా ఈ ఏడాది డిసెంబర్ నుంచి అమలవుతాయి. ఈయూ నిర్ణయం ప్రకారం.. చాలా ఉత్పత్తులపై 25 శాతం వరకూ టారిఫ్ ఉంటుందని సమాచారం. చాలా కొన్ని క్యాటగిరీలకు మాత్రం పదిశాతం వర్తించనున్నది.