Iran | సంచలన నిర్ణయం.. మళ్లీ హోర్ముజ్ జలసంధిని మూసివేసిన ఇరాన్.. సీజ్‌ఫైర్ డీల్ రద్దవుతుందా?
Iran |పశ్చిమాసియాలో ఉద్రికత్త పరిస్థితులు ఇప్పుడే చల్లారేలా కనిపించడం లేదు. మరోసారి హోర్మజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. హోర్ముజ్ జలసంధిలో చమురు ట్యాంకర్ల రవాణాను పూర్తిగా నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించింది.
Iran | పశ్చిమాసియాలో ఉద్రికత్త పరిస్థితులు ఇప్పుడే చల్లారేలా కనిపించడం లేదు. మరోసారి హోర్ముజ్ జలసంధిని మూసివేస్తూ ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేయడమే ఇందుకు కారణమని తెలిపింది. కాగా, రెండు వారాల పాటు కాల్పుల విరమణకు అమెరికాతో ఒప్పందం చేసుకున్న కొద్ది గంటల్లోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
కొద్దిగంటల ముందే సీజ్‌ఫైర్ డీల్!
మంగళవారం రాత్రితో ఇరాన్ నాగరితక అంతం చేస్తామని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు. ఇరాన్‌కు పెట్టిన డెడ్‌లైన్ ముగియడానికి సరిగ్గా గంటన్నర ముందు చేసిన వ్యాఖ్యలపై తగ్గి.. కాల్పుల విరమణ ఒప్పందాన్ని చేసుకున్నారు. దీంతో రెండు వారాల పాటు యుద్ధం వాయిదా వేస్తున్నామని, ఈలోపు శాంతి చర్చలు జరుగుతాయని తెలిపారు. ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ మద్దతు ఇచ్చింది. కానీ ఈ ఒప్పందంలోకి లెబనాన్‌ను చేర్చలేదు. ఈ క్రమంలోనే లెబనాన్‌పై ఇజ్రాయెల్ దారుణంగా విరుచుకుపడింది.
10 నిమిషాల్లో 100 ఎయిర్ స్ట్రయిక్స్
కేవలం 10 నిమిషాల్లోనే లెబనాన్‌పై ఇజ్రాయెల్ 100కిపైగా వైమానిక దాడులను చేసింది. ఈ దాడుల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. 1982 తర్వాత లెబనాన్‌పై ఇదే అతిపెద్ద దాడి అని స్థానిక అధికారులు తెలిపారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ లెబనాన్‌పై దాడి చేయడాన్ని ఇరాన్ సీరియస్‌గా తీసుకుంది. దీంతో ఈ కాల్పుల విరమణ ఒప్పందంపై ఇరాన్ పునరాలోచన చేస్తున్నట్లుగా ఆ దేశ మీడియా ప్రకటించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని రద్దు చేసుకుని, మళ్లీ యుద్ధానికి దిగాలని ఇరాన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
హోర్ముజ్ జలసంధి మూసివేసిన ఇరాన్
అయితే లెబనాన్‌పూ దాడులను ఇజ్రాయెల్ సమర్థించుకుంది. ఇరాన్ అమెరికా మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం లెబనాన్‌కు వర్తించదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ తెలిపారు. ఈ సీజ్ ఫైర్ డీల్‌లో లెబనాన్‌కు చోటు లేదని ప్రకటించారు. ఈ క్రమంలోనే హోర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటించిందని తెలిపింది. హోర్ముజ్ జలసంధి అందుబాటులోకి వచ్చాక కేవలం రెండు నౌకలు మాత్రమే అందులో నుంచి వెళ్లాయని.. ఆ తర్వాత జలసంధిని మూసివేసినట్లుగా తెలుస్తోంది. మళ్లీ హోర్ముజ్ జలసంధిని మూసివేయడంతో చమురు సంక్షోభం తప్పేలా లేదని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram