• Telugu News
  • /International

Israel Airsrikes | యెమెన్‌పై యుద్ధం ప్రారంభించిన ఇజ్రాయెల్.. ఐడీఎఫ్ నౌకాశ్రయం ధ్వంసం

Israel airstrikes | యెమెన్‌ దేశంపై ఇజ్రాయెల్‌ యుద్ధం ప్రారంభించింది. టెల్ అవీవ్ నగరంపై హౌతీ తిరుగుబాటుదారులు చేసిన డ్రోన్ దాడికి ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుంది. ఆ దాడి జరిగిన మరుసటి రోజే ఇజ్రాయెల్ పశ్చిమ యెమెన్‌లోని అనేక తిరుగుబాటు గ్రూపు లక్ష్యాలపై దాడులు చేసింది.

Reported by: Thyagi | అంత‌ర్జాతీయం | Jul 21, 2024, 9:15 am IST
Read Time: 4 mins
Israel Airsrikes | యెమెన్‌పై యుద్ధం ప్రారంభించిన ఇజ్రాయెల్.. ఐడీఎఫ్ నౌకాశ్రయం ధ్వంసం

Israel Airsrikes : యెమెన్‌ దేశంపై ఇజ్రాయెల్‌ యుద్ధం ప్రారంభించింది. టెల్ అవీవ్ నగరంపై హౌతీ తిరుగుబాటుదారులు చేసిన డ్రోన్ దాడికి ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుంది. ఆ దాడి జరిగిన మరుసటి రోజే ఇజ్రాయెల్ పశ్చిమ యెమెన్‌లోని అనేక తిరుగుబాటు గ్రూపు లక్ష్యాలపై దాడులు చేసింది. ఇజ్రాయెల్ ఆర్మీ ఈ సమాచారాన్ని ఇచ్చింది. అక్టోబర్‌లో ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత యెమెన్ గడ్డపై ఇజ్రాయెల్ చేసిన మొదటి దాడి ఇదే కావడం గమనార్హం.

ఇజ్రాయెల్ సైన్యం హౌతీల బలమైన కోటగా భావించే పశ్చిమ ఓడరేవు నగరం హోడైదాలో అనేక స్థానాలపై దాడి చేసింది. ఇటీవలి నెలల్లో ఇజ్రాయెల్‌పై వందలాది దాడులకు ప్రతిస్పందనగా ఈ చర్య తీసుకున్నట్లు ఇజ్రాయెల్‌ ఆర్మీ తెలిపింది. ఇంధన నిల్వ కేంద్రాలు, పవర్ ప్లాంట్‌లను లక్ష్యంగా చేసుకుని యెమెన్‌పై ఇజ్రాయెల్ దాడి జరిగిందని హౌతీ తిరుగుబాటు గ్రూపు ప్రతినిధి మహ్మద్ అబ్దుల్సలామ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో తెలిపారు.

ఈ దాడుల ద్వారా ఇజ్రాయెల్ ప్రజల కష్టాలను మరింత పెంచాలనుకుంటోందని అబ్దుల్సలామ్ తెలిపారు. గాజాకు మద్దతివ్వడం మానేయాలని యెమెన్‌పై ఒత్తిడి తీసుకురావడానికి ఈ దాడి జరిగిందని ఆయన అన్నారు. ఈ దాడులు యెమెన్ ప్రజలను, గాజాకు మద్దతుగా సాయుధ బలగాలను మరింత బలపరుస్తాయని అబ్దుల్సలామ్ పేర్కొన్నారు. దాడి కారణంగా ఓడరేవులో అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

యెమెన్‌లోని ఆరోగ్య అధికారులు ఇజ్రాయెల్ దాడిలో చాలామంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు ఒక రోజు ముందు ఇజ్రాయెల్‌పై డ్రోన్ దాడి చేశారు. అమెరికా రాయబార కార్యాలయానికి అతి సమీపంలో ఉన్న ప్రదేశంలో ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో 10 మంది గాయపడ్డారు.