SpaceX | కాలిఫోర్నియాకు స్పేస్‌ ఎక్స్‌ గుడ్‌బై!.. ఆస్టిన్‌కు ఎక్స్‌ హెడాఫీసు

కాలిఫోర్నియా చేస్తున్న చట్టాలకు నిరసనగా స్పేస్‌ ఎక్స్‌ ప్రధాన కార్యాలయాన్ని హాథార్న్‌ నుంచి టెక్సాస్‌లోని స్టార్‌బేస్‌కు మార్చుతున్నట్టు ఎలాన్‌ మస్క్‌ ఎక్స్‌ ఖాతాలో ప్రకటించారు

SpaceX | కాలిఫోర్నియాకు స్పేస్‌ ఎక్స్‌ గుడ్‌బై!.. ఆస్టిన్‌కు ఎక్స్‌ హెడాఫీసు

కాలిఫోర్నియా : కాలిఫోర్నియా చేస్తున్న చట్టాలకు నిరసనగా స్పేస్‌ ఎక్స్‌ ప్రధాన కార్యాలయాన్ని హాథార్న్‌ నుంచి టెక్సాస్‌లోని స్టార్‌బేస్‌కు మార్చుతున్నట్టు ఎలాన్‌ మస్క్‌ ఎక్స్‌ ఖాతాలో ప్రకటించారు. ఎక్స్‌ ప్రధాన కార్యాలయాన్ని కూడా ఆస్టిన్‌కు మార్చనున్నట్టు మస్క్‌ ప్రకటించారు. ప్రభుత్వం కుటుంబాలకు వ్యతిరేకంగా, కంపెనీలకు వ్యతిరేకంగా చేస్తున్న చట్టాలపై మస్క్‌ కొంతకాలంగా విరుచుకుపడుతున్నారు.

తలిదండ్రుల పాత్రను కూడా నియంత్రించే కొత్త చట్టాన్ని కాలిఫోర్నియా డెమాక్రాటిక్‌ ప్రభుత్వం తీసుకువచ్చింది. పిల్లలు ట్రాన్స్‌జెండర్‌ అయితే తలిదండ్రులు ముందుగానే తెలియజేయాలని స్కూలు యాజమాన్యాలు నిబంధనలు విధించడాన్ని గవర్నర్‌ న్యూసోమ్‌ ప్రభుత్వం నిషేధించింది. దీంతో కాలిఫోర్నియాలో ప్రభుత్వమే తలిదండ్రుల పాత్రను తీసేసుకుంటున్నదని విమర్శలు వెల్లువెత్తాయి. తల్లిదండ్రులు పిల్లలను పబ్లిక్‌ స్కూళ్ల నుంచి వెనుకకు తీసుకోవాలని మస్క్‌ విమర్శనాత్మకంగా పేర్కొన్నారు