US Set For Mass Resignation | అమెరికా చరిత్రలో ఒకే రోజు లక్ష ఉద్యోగుల రాజీనామాలు

అమెరికా చరిత్రలో తొలిసారి ఒకే రోజు లక్ష ఫెడరల్ ఉద్యోగులు ట్రంప్ సంస్కరణల కారణంగా స్వచ్ఛంద రాజీనామాలు చేశారు.

US Set For Mass Resignation | అమెరికా చరిత్రలో ఒకే రోజు లక్ష ఉద్యోగుల రాజీనామాలు

విధాత : అమెరికా చరిత్రలో ఒకే రోజు లక్ష మంది వరకు ఫెడరల్ ఉద్యోగులు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. ప్రభుత్వ పాలనా వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచేందుకు సంస్కరణల పేరుతో అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వ ఉద్యోగులు స్వచ్చందంగా ఉద్యోగ విరమణ చేయాలని ఆదేశించారు. ఇందుకు ట్రంప్ విధించిన గడువు నేటితో ముగిసిపోవడంతో ఒకో రోజు లక్ష మంది ఉద్యోగులు తమ ఉద్యోగాల నుంచి వైదొలిగారు. నిపుణుల అంచనాల ప్రకారం, ఈ ఏడాది ముగిసే సమయానికి ఈ సంఖ్య మూడులక్షలకు పైగా చేరుకోవచ్చని చెబుతున్నారు. రెండో ప్రపంచ యుద్దం తర్వాత ప్రభుత్వ రంగంతో ఇంత భారీ ఎత్తున ఉద్యోగుల రాజీనామాలు ఇదే కావడం విశేషం. స్వచ్చంద రాజీనామాలు చేయని ఉద్యోగుల తొలగింపుకు ట్రంప్ సర్కార్ ప్రణాళికలు సిద్దం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు మూకుమ్మడి రాజీనామాలు సమర్పించారు. రాజీనామా చేసిన ఉద్యోగులకు ఒకేసారి వేతన సెటిల్మెంట్ వసతి కల్పించారు.

డిఫర్డ్ రెసిగ్నేషన్ ప్రోగ్రామ్ (డీఆర్ పీ )’ పేరుతో ట్రంప్ సర్కార్ ఉద్యోగుల స్వచ్చంద ఉద్యోగ విరమణకు ఒక ప్రత్యేక పథకాన్ని అమలు చేసింది. దీని ప్రకారం, ఉద్యోగులు సెప్టెంబర్ 30లోపు స్వచ్ఛంద రాజీనామా చేస్తే, ఆ తేదీ వరకు పనికి రాకపోయినా పూర్తి జీతభత్యాలు పొందే వీలు కల్పించారు.ప్రభుత్వ పాలన రంగ సామర్ధ్యం మెరుగుపరిచేందుకు ఉద్యోగుల కుదింపు అని..ట్రంప్ ప్రభుత్వం చెబుతుండగా…ట్రంప్ తన తిరోగమన చర్యలతో ప్రభుత్వ వ్యవస్థను బలహీనపరుస్తున్నారంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఉద్యోగుల కుదింపుతో పన్నుల వసూళ్లు..ఆర్థిక రంగాలపై తీవ్ర ప్రతికూలత ఏర్పడనుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.