Taylor Swift | అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. కమలా హారిస్‌కు పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్ మద్దతు..!
Taylor Swift | ఈ ఏడాది నంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. రిపబ్లికన్ పార్టీ తరఫున డోనాల్డ్ ట్రంప్.. అధికార డెమోక్రటిక్ పార్టీ నుంచి కమలా హారిస్ బరిలోకి దిగారు. ఇద్దరు నేతలకు పలువురు ప్రముఖులు మద్దతు ప్రకటిస్తున్నారు.

Taylor Swift | ఈ ఏడాది నంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. రిపబ్లికన్ పార్టీ తరఫున డోనాల్డ్ ట్రంప్.. అధికార డెమోక్రటిక్ పార్టీ నుంచి కమలా హారిస్ బరిలోకి దిగారు. ఇద్దరు నేతలకు పలువురు ప్రముఖులు మద్దతు ప్రకటిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలు పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్ పేరు సైతం చేరబోతున్నది. ఈ సారి అమెరికా అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా మారునున్నాయి. ఇప్పటికే ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఈక్రమంలో టేలర్ స్విఫ్ట్ కమలా హారిస్‌కు మద్దతు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని.. ఆమె వైట్‌హౌస్‌లో శక్తివంతమైన మహిళను చాడాలనుకుంటున్నారని సన్నిహిత వర్గాలు తెలిపారు. ఈ క్రమంలో ఉపాధ్యక్షురాలిగా ఉన్న ఆమెకు మద్దతు ఇచ్చేందుకు ఉత్సాహంగా ఉన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
2020 ఎన్నికల సమయంలో అమెరికన్ గాయకురాలు జో బైడెన్‌కు మద్దతు ఇచ్చారు. తాజాగా ఈ ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్‌తో పోలిస్తే కమలా హారిస్‌కు మద్దతు తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా టేలర్ స్విఫ్ట్ 14 సార్లు గ్రామీ అవార్డును అందుకున్న డిమోక్రటిక్ పార్టీకి పలుసార్లు మద్దతు ఇచ్చారు. ఈ సారి సైతం సైతం అదే జరుగుతుందని.. నాలుగైదు వారాల్లో టేలర్ స్విఫ్ట్ ప్రకటన ఉండబోతుందని సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. వాస్తవానికి టేలర్ స్విఫ్ట్‌కు భారీగా ఫాలోవర్స్ సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఆమె మద్దతు పలికితే విజయంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గతంలో ఆమె ‘గో వోట్’ పేరుతో ఓటర్లకు చేసిన అప్పీల్‌తో యువ ఓటర్లు ఎక్కువగానే ఓటు హక్కు వినియోగించుకున్నారు. దాంతో రెండు పార్టీలు ఆమె మద్దతును కోరుతూ వస్తున్నాయి. ఇప్పటి వరకు మద్దతు ప్రకటించే విషయంపై ఆమె ఎలాంటి ప్రకటన చేయలదు.