అమెరికాలో విమాన ప్రమాదం.. 12 మంది దుర్మరణం

అమెరికాలో స్కైడైవింగ్ విమానం కుప్పకూలి 12 మంది దుర్మరణం చెందారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం కూలిపోవడంతో మంటలు చెలరేగాయి.

అమెరికాలో జరిగిన విమాన ప్రమాదంలో 12మంది దుర్మరణం చెందారు. మిస్సోరి రాష్ట్రంలోని కన్సాస్ సిటీకి 65 మైళ్ల దూరంలో బట్లర్‌ మెమోరియల్‌ ఎయిర్‌పోర్టు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. స్కై డైవింగ్ కోసం 11 మంది ప్రయాణికులతో సింగిల్ ఇంజిన్ తో కూడిన విమానం బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అదుపు తప్పి కుప్పకూలిపోయింది. విమానం నేలను తాకగానే మంటలు చెలరేగడంతో అందులోని ప్రయాణికులు సజీవదహన మయ్యారు.

ప్రమాదంలో పైలట్‌తో సహా మొత్తం 12 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. విమానప్రమాదానికి గల కారణాలు, మృతుల వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.

Latest News