Iran US War | హర్మూజ్‌ జలసంధి మూసివేత.. భారత్‌లో పెట్రో ధరలు పెరుగుతాయా?

అంతర్జాతీయ ముడి చమురు వ్యాపారానికి హర్మూజ్ జలసంధి జీవనాడిగా విలసిల్లుతున్న విషయం విదితమే. ముడి చమురు దిగుమతుల్లో ప్రపంచ దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉన్నది. ప్రతినిత్యం 5.5 మిలియన్ బ్యారెళ్ల చమురు దిగుమతి చేసుకుంటుండగా, అందులో 2 మిలియన్ బ్యారెళ్లు హర్మూజ్ నుంచే రవాణా అవుతున్నాయి.

Iran US War | హర్మూజ్‌ జలసంధి మూసివేత.. భారత్‌లో పెట్రో ధరలు పెరుగుతాయా?

Iran US War | అందరూ అనుకున్నట్లుగానే ఇరన్ దేశం తన రక్షణ కోసం సంచలన నిర్ణయం తీసుకున్నది. హర్మూజ్ జలసంధి మూసివేయాలని ఇరాన్ పార్లమెంట్ ఆమోదముద్ర వేసింది. దీనితో మున్ముందు భారత్ లో చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ముగిసే వరకు ఈ ధరలు పెరిగే అవకాశాలను ఏమాత్రం తోసిపుచ్చలేము. రష్యా నుంచి చౌక ధరకు ముడి చమురు దిగుమతి చేసుకుంటున్నామని చెబుతున్నప్పటికీ, యుద్ధాన్ని కారణంగా చూపి బీజేపీ ప్రభుత్వం ఇంధన ధరలను పెంచుకుంటూ పోయే పరిస్థితిని కొనసాగించవచ్చని అంటున్నారు.

అంతర్జాతీయ ముడి చమురు వ్యాపారానికి హర్మూజ్ జలసంధి జీవనాడిగా విలసిల్లుతున్న విషయం విదితమే. ముడి చమురు దిగుమతుల్లో ప్రపంచ దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉన్నది. ప్రతినిత్యం 5.5 మిలియన్ బ్యారెళ్ల చమురు దిగుమతి చేసుకుంటుండగా, అందులో 2 మిలియన్ బ్యారెళ్లు హర్మూజ్ నుంచే రవాణా అవుతున్నాయి. ప్రపంచ వాణిజ్యం, ఇంధన భద్రతకు అత్యంత కీలకమైన ఈ ప్రాంతాన్ని సురక్షితంగా ఉంచేందుకు చైనా, ఫ్రాన్స్, అమెరికా దేశాలు తమ నౌకా దళాలను మోహరిస్తుంటాయి. అత్యంత ఇరుకుగా ఉండే ఈ జలసంధి వెడెల్పు 33 కిలో మీటర్లు కాగా, బహ్రేయిన్, కువైట్, ఇరాన్, సౌదీ అరేబియా, ఇరాక్, ఖతార్, యూఏఈ దేశాలు ఈ సంధి గుండా ముడి చమురు ఎగుమతి చేస్తుంటాయి. ఇప్పుడు ఇరాన్‌ నిర్ణయంతో ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోతాయి.