Aghori Srinivas| జైలు నుండి విడుదలైన అఘోరీ శ్రీనివాస్

విధాత : తెలుగు రాష్ట్రాలలో తన ప్రవర్తనతో హల్చల్ సృష్టించిన అఘోరీ శ్రీనివాస్( Aghori Srinivas) మంగళవారం చంచల్ గూడ జైలు(Released from Chanchalguda Jail) నుంచి విడుదలయ్యారు. మత విశ్వాసాల పేరుతో మోసాలకు పాల్పడిన కేసులో వేములవాడ, కొమురవెల్లి, చేవెళ్ల, కరీంనగర్‌లో అఘోరీ శ్రీనివాస్‌పై 4 కేసులు నమోదైయ్యాయి. శ్రీనివాస్‌ను పోలీసులు ఉత్తరప్రదేశ్‌లో అరెస్టు చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు. వైద్య పరీక్షల్లో శ్రీనివాస్ ట్రాన్స్‌జెండర్‌గా తేలడంతో పోలీసులు ఆయనను మహిళా జైలుకు తరలించారు. మూడు నెలలుగా అఘోరీ శ్రీనివాస్ చంచల్‌గూడ మహిళా జైలులో ఉన్నారు. ఆయా కేసుల్లో బెయిల్ రావడంతో జైలు నుంచి విడుదలయ్యారు. పూజలు, మంత్రాల పేరుతో ప్రజలను ఆకట్టుకున్న శ్రీనివాస్, ఆ తర్వాత మోసాలు, బెదిరింపుల కేసులతో వార్తల్లో నిలిచారు. వర్షిణీ అనే యువతిని పెళ్లి చేసుకోగా..ఆమె తల్లిదండ్రులు కిడ్నాప్ కేసు పెట్టారు.
జైలు నుంచి విడుదలకు అఘోరీ శ్రీనివాస్ మాట్లాడుతూ నాపై చేసిన అభియోగాలన్ని అవాస్తవమన్నారు. నాపై కేసులు పెట్టడం వెనుక కుట్రదారులెవరో తెలుసుకుంటానన్నారు. నమ్మిన భక్తులే నన్ను మోసం చేసి కేసుల్లో ఇరికించారని వాపోయారు. వర్షిణి గురించి అలోచించి టైం వేస్ట్ చేసుకోనన్నారు. తాను ఇప్పుడు అయితే కాశీ వెళ్తున్నానని..నాకు బంధాలు, బంధుత్వాలు వద్దు అని స్పష్టం చేశారు. గురువుల ఆశీస్సులు తీసుకుని తదుపరి కార్యాచరణ చేపడుతానన్నారు.