Air travel problems| విమాన ప్రయాణికుల వింత కష్టాలు.. నీళ్ల బాటిళ్లలోనే మూత్ర విసర్జన!

విధాత : ఇటీవల కాలంలో పెరిగిన ప్రమాదాలతో పాటు విమానయాన సంస్థలు పెడుతున్న తిప్పలతో ప్రయాణికులు(passengers inconvenience) ఇబ్బంది పడుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ఓ విమానం గాలిలో ప్రయాణిస్తున్న క్రమంలో దానిలోని టాయిలెట్లు పనిచేయకపోవడం(airplane toilet failure)తో ప్రయాణికులు నీళ్ల బాటిళ్లలోనే మూత్ర విసర్జన(passengers forced to urinate in bottles) చేసుకోవాల్సిన వింత ఘటన వైరల్ గా మారింది. ఇండోనేషియా బాలి నుంచి బ్రిస్బేన్(Brisban)కు వెళ్తుండగా వర్జిన్ ఆస్ట్రేలియా (Virgin Australia flight)బోయింగ్ విమానంలో ఈ సమస్య చోటుచేసుకుంది. డెన్‌పసర్ ఎయిర్‌పోర్ట్ నుంచి బ్రిస్బేన్ కు బయల్దేరిన విమానం ఆరు గంటల జర్నీ కోసం టేకాఫ్ అయ్యాక కొన్ని టాయిలెట్లలో సమస్య ఉందని గుర్తించారు. తొలి మూడు గంటలు ఒక బాత్రూం వినియోగించాక.. ఆ తర్వాత అందులోనూ సమస్య ఏర్పడింది. చేసేది లేక ప్రయాణికులు నీళ్ల బాటిళ్లలోనే మూత్ర విసర్జన చేసుకోవాల్సి వచ్చింది.
ఈ పరిస్థితితో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఒక వృద్ధ మహిళ తనను తాను నియంత్రించుకోలేక బహిరంగంగా మూత్ర విసర్జన చేసేసింది. విమానం 3వేల అడుగుల ఎత్తులో ఉండగా విమానంలో అన్ని టాయిలెట్లు పనిచేయడం మానేశాయని బాధిత ప్రయాణికులు తెలిపారు. మూడు గంటల మిగిలిన సమయంలో మమ్మల్ని బాటిల్‌లో లేదా ఇప్పటికే మురికిగా ఉన్న టాయిలెట్‌లో మూత్ర విసర్జన చేయమన్నారని.. ఇది అవమానకరంగా తయారైందని ప్రయాణికులు మండిపడ్డారు. ఈ ఘటనపై స్పందించిన వర్జిన్ ఆస్ట్రేలియా విమాన సంస్ధ ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పింది. బాధిత ప్రయాణికులకు విమాన టికెట్ డబ్బులు క్రెడిట్ ఇవ్వబడుతుందని తెలిపింది. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ కాగా.. అంతా విమాన ప్రయాణికులకు వసతులు చాల గొప్పగా ఉంటాయనుకుంటారని..ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు సామాన్యుడికి కూడా అన్ని అవస్థలు ఉండవేమోనంటు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.