Australia Missing Plane| 22రోజులుగా జాడ లేని విమానం..మిస్టరీగా మిస్సింగ్

విధాత : అస్ట్రేలియాలో ఆగస్టు 2న అదృశ్యమైన విమానం(Australia Missing Plane) జాడ22రోజులైనా లభించకపోవడం ఆసక్తికరంగా మారింది. విమానం మిస్సింగ్ మిస్టరీ(Missing Aircraft) కి కారణమేమిటో..అసలు విమానం ఏమైందన్న అంశంపై అధికారులు ముమ్మరంగా గాలింపు సాగిస్తున్నారు. ఈ విమానానికి సంబంధించిన ఎటువంటి డిస్ట్రెస్ సిగ్నల్, రేడియో కాంటాక్ట్ లేదని అధికారులు చెప్తున్నారు. వివరాల్లోకి వెళితే ఈనెల 2న ఆస్ట్రేలియా గ్రెగొరీ వాఘన్(Gregory Vaughan 72), అతని భార్య కిమ్ వార్నర్(Kim Warner, 66), వారి పెంపుడు కుక్క మోలీ ప్రయాణిస్తున్న విమానం అదృశ్యమైంది. ఈ కొత్త ఫెర్రీ విమానాన్ని గ్రెగొరీ ఇటీవలే కొనుగోలు చేశారు.
విమానం టాస్మానియాలోని జార్జ్‌టౌన్ విమానాశ్రయం నుంచి ఆగస్టు 2 మధ్యాహ్నం 12:45 గంటల ప్రాంతంలో విమానాశ్రయం నుంచి బయలుదేరింది. గ్రెగొరీ దంపతులు ప్రయాణిస్తున్న ఈ విమానం మొదల విక్టోరియా విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది. అక్కడ నుంచి తిరిగి న్యూ సౌత్ వేల్స్ లోని హిల్స్ టన్ విమానాశ్రయానికి వెళ్లాల్సి ఉంది. ఈ విమానం బాస్ స్ట్రెయిట్ సముద్రం మీదుగా గమ్యస్థానాన్ని చేరుకోడానికి బయలుదేరింది. ఆ తర్వాత విమానం ఏమైందన్నది తెలియడం లేదు. కుటుంబ సభ్యులు, స్నేహితులకు సాయంత్రం ఐదు గంటల వరకు ఎటువంటి వార్త అందకపోవడంతో వెంటనే వారు ఆందోళనతో విమానాశ్రయ అధికారులను సంప్రదించారు. వెంటనే ఆస్ట్రేలియన్ మారిటైమ్ సేఫ్టీ అథారిటీ (ఏఎంఎస్ఏ) విమానం కోసం గాలింపు చర్యలు ప్రారంభించింది. ఉత్తర టాస్మానియా, బాస్ స్ట్రెయిట్, దక్షిణ విక్టోరియా ప్రాంతాలలో పోలీసు పడవలు, హెలికాప్టర్లు ఆ ఫెర్రీ విమానం కోసం వెతకడం ప్రారంభించాయి. కానీ వారికి ఇప్పటి వరకు విమానానికి సంబంధించిన ఎటువంటి జాడ దొరకలేదు.
దీనిపై టాస్మానియా పోలీస్ అధికారి క్లార్క్ మాట్లాడుతూ.. గ్రెగొరీ అనుభవజ్ఞుడైన పైలట్ అని.. స్థానిక ఫ్లయింగ్ క్లబ్‌లో ప్రముఖ సభ్యుడని తెలిపారు. విమానాలను నడపడంలో చాలా కాలంగా అనుభవం ఉందన్నారు. అయితే ఆయన ప్రయాణించిన విమానం కొత్తది కావడంతో దానిలో ఏదైనా సాంకేతిక లోపం తలెత్తిందా, లేక మరేదైనా కారణంతో విమానం అదృశ్యమైందా అనేది తెలియాల్సి ఉందని చెప్పాడు. ఆశ్చర్యకరంగా విమానం నుంచి ఎటువంటి అత్యవసర సిగ్నల్ రాకపోవడంతో దాని జాడ తెలుసుకోవడంలో ఆలస్యమవుతుందన్నారు. చిన్న విమానాలు తీరం నుంచి బయలుదేరే ముందు వైమానిక అధికారులకు తెలియజేయడం తప్పనిసరి అని.. గ్రెగొరీ ఎందుకో సమాచారం ఇవ్వలేదన్నారు. జార్జ్‌టౌన్‌లో ప్రతి చిన్న విమానాన్ని అధికారులు పర్యవేక్షించబోరని.. ఎవరైనా విమానాన్ని దాని హ్యాంగర్ నుంచి తీసివేసి ఎగిరితే, దానిని గుర్తించడం కష్టమవుతుందని తెలిపారు. ఇక్కడ