Indigo compensation| ఇండిగో బాధితులకు రూ. 10వేల పరిహారం
విమాన సర్వీసుల రద్దుతో ఇబ్బంది పడిన ప్రయాణికులకు ఇండిగో సంస్థ రూ.10వేల విలువైన వోచర్లను పరిహారంగా ఇస్తామని ప్రకటించింది. ఈ ట్రావెల్ వోచర్లను రానున్న 12 నెలల్లో ఇండిగో ప్రయాణంలో వాటిని వాడుకోవచ్చని తెలిపింది.
న్యూఢిల్లీ : విమాన సర్వీసుల రద్దుతో ఇబ్బంది పడిన ప్రయాణికుల(Indigo passengers)కు ఇండిగో సంస్థ రూ.10వేల విలువైన వోచర్ల( Indigo compensation)ను పరిహారం(Rs 10000 vouchers)గా ఇస్తామని ప్రకటించింది. డిసెంబర్ 3నుంచి 7వ తేదీ మధ్య సర్వీసుల రద్దు కారణంగా ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లో చిక్కుకుపోయారు. ఆకస్మికంగా విమాన సర్వీసుల రద్దుతో తీవ్రంగా ఇబ్బందులుపడిన ప్రయాణికులకు ఇప్పటికే సారీ చెప్పిన ఇండిగో సంస్థ ఇప్పుడు రూ.10వేల ట్రావెల్ వోచర్లను పరిహారంగా అందిస్తామని ఊరటనిచ్చే ప్రయత్నం చేసింది. ఈ ట్రావెల్ వోచర్లను రానున్న 12 నెలల్లో ఇండిగో ప్రయాణంలో వాటిని వాడుకోవచ్చని తెలిపింది.
పైలట్ల కొరత వంటి కారణాలతో కొన్నిరోజుల పాటు తీవ్ర సంక్షోభంలో చిక్కుకుపోయిన దేశీయ విమానయాన సంస్థ ఇండిగో క్రమంగా పూర్తిస్థాయిలో తిరిగి విమాన సర్వీసులను పునరుద్దరించేందుకు ప్రయత్నిస్తుంది. డీజీసీఏ సైతం నిబంధనలు సడలించి సర్వీస్ ల పునరుద్దరణకు వెసులుబాటు కల్పించింది.
ఇటీవల వారం రోజులకు పైగా ఈ విమానయాన సంస్థ వందల కొద్ది సర్వీసుల్ని రద్దు చేసింది. కేంద్రం ఇండిగో సర్వీస్ ల రద్దు వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకొని, దర్యాప్తు కమిటీ వేసింది. ఇదిలా ఉంటే తమ విమాన సర్వీసుల పూర్తిస్థాయి పునరుద్దరణ పూర్తి కావచ్చింది…సాధారణ రోజుల్లో రోజుకు 2,200సర్వీస్ లు నడిపే సంస్థ తిరిగి 1950సర్వీస్ ల పునరుద్దరణ చేయగలిగిందని ఇండిగో పేర్కొంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram