Toxic Work Culture | కార్పొరేట్ కల్చర్‌లో ప్రొఫెషనల్ లైఫ్‌కి, పర్సనల్ లైఫ్‌కి మధ్య బ్యాలెన్స్ పూర్తిగా తప్పిపోతుంది. దీనికి సంబంధించిన ఓ ఉదాహరణ సోషల్‌మీడియాలో చర్చకు వచ్చింది. పెళ్లి రోజునే ఓ ఉద్యోగి పని చేయడంతో ఆ కంపెనీ యాజమాన్యంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
అమెరికాకు చెందిన ప్రముఖ ఈ కామర్స్ అనలిటిక్స్ సంస్థ ట్రిపుల్ వేల్ (Triple Whale) సహ వ్యవస్థాపకుడు ఏజే ఓర్బాచ్ (AJ Orbach) సోషల్‌మీడియాలో తాజాగా ఒక పోస్టు చేశాడు. తన ఉద్యోగి ఒకరు పెళ్లి రోజున కూడా ఆన్‌లైన్‌లోకి వచ్చి పనిచేయడం చూసి మురిసోయి.. దాన్ని ట్విట్టర్(ఎక్స్) వేదికగా పంచుకున్నాడు.
“మా టీంమ్‌లో ఒకరు ఇవాళ పెళ్లి చేసుకున్నారు. అయినా సరే కొద్దిసేపు ఆన్‌లైకి వచ్చారు. అతన్ని రమ్మని ఎవరూ అడగలేదు. పూర్తి అనుమతితో లీవ్ తీసుకున్నప్పటికీ.. పని మీద ఆసక్తితో వచ్చాడు. ఇలాంటి ఓనర్‌షిప్ చాలా ప్రత్యేకం.” అని అందులో రాసుకొచ్చాడు. అది చూసి తమ కంపెనీ ఉద్యోగుల నిబద్ధతను అందరూ మెచ్చుకుంటారని భావించాడు. కానీ అది కాస్త బ్యాక్‌ఫైర్ అయ్యింది. దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సోషల్‌మీడియాలో ఊహించని రెస్పాన్స్ రావడంతో ఓర్బాచ్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఆ ఉద్యోగి పేరు దైలాన్ గిఫర్డ్ అని.. అతనికి సెలవు ఇచ్చానని తెలిపారు. తాను ఆన్‌లైన్‌లోకి రాగానే.. లాగ్‌ఆఫ్ చేయమని చెప్పానని కూడా స్పష్టం చేశాడు. కానీ నెటిజన్లు మాత్రం ఈ చర్యపై తీవ్రంగా మండిపడుతున్నారు.
పెళ్లి రోజే పనికి రమ్మని ఎలా పిలుస్తారు అని పలువురు ప్రశ్నిస్తున్నారు. మీరు మెసేజ్ చేయకపోతే.. అతను ఆన్‌లైన్‌కి వచ్చేవాడు కాదని మరికొంతమంది అభిప్రాయపడ్డారు. ఇది మంచి వర్క్ కల్చర్ కాదని.. వ్యక్తిగత జీవితానికి గౌరవం ఇవ్వాలని పలువురు సూచిస్తున్నారు. ఇది విష సంస్కృతి అని కొందరు.. మానవత్వం చచ్చిపోయిందా అంటూ మరికొందరు కామెంట్లు పెట్టారు. అలా ఈ పోస్టు అతి తక్కువ సమయంలోనే సోషల్‌మీడియాలో సంచలనం సృష్టించింది. దీంతో ఓర్బాచ్ తన ట్వీట్‌ను డిలీట్ చేశారు. కానీ వర్క్, పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ లోపించడంపై ఆన్‌లైన్‌లో పెద్ద చర్చనే కొనసాగుతోంది.
Read More:
Aunty | ఆంటీ అని పిలిచినందుకు కోర్టుకెక్కిన మహిళ.. రూ.1.8 లక్షల ఫైన్ విధిస్తూ తీర్పు
68 కోట్ల కట్నం ఇచ్చి.. పాతికేళ్ల కుర్రాడిని పెళ్లి చేసుకున్న 55 ఏళ్ల మహిళ
