CM Revanth Reddy| బీసీ రిజర్వేషన్లపై జస్టిస్ సుదర్శన్ రెడ్డితో భేటీ: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy| బీసీ రిజర్వేషన్లపై జస్టిస్ సుదర్శన్ రెడ్డితో భేటీ: సీఎం రేవంత్ రెడ్డి

విధాత, హైదరాబాద్ : బీసీ రిజర్వేషన్ల(BC Reservations Telangana) వ్యవహారంపై ఇండియా కూటమి(India Allianc) ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి(Justice Sudarshan Reddy)తో సమావేశమైనట్లుగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఎక్స్ వేదికగా వెల్లడించారు. సహచర మంత్రులు, పార్టీ బీసీ నాయకులతో కలిసి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డితో భేటీయైనట్లుగా తెలిపారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి రాజ్యాంగపరంగా, న్యాయపరంగా ఉన్న మార్గాలపై ఆయన సూచనలు, సలహాలు తీసుకున్నాం అని పేర్కొన్నారు. ఈ భేటీలో ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క, మంత్రులు, ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, డి. శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సలహాదారు కే. కేశవరావు, ఇతర బీసీ నేతలు పాల్గొన్నట్లుగా రేవంత్ రెడ్డి వెల్లడించారు.

ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన బీసీ కులగణన అధ్యయనానికి ప్రభుత్వం నియమించిన స్వతంత్ర నిపుణుల కమిటీ చైర్మన్ గా జస్టిస్ బీ.సుదర్శన్ రెడ్డి పనిచేసిన సంగతి తెలిసిందే. ఆయన సూచనల మేరకు తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42శాతం రిజర్వేషన్ల బిల్లులను ఆమోదించిందని రేవంత్ రెడ్డి ఇటీవల వెల్లడించారు.