Revanth Reddy| రాసిపెట్టుకోండి.. 2034 జూన్ వరకు అధికారంలో మేమే : సీఎం రేవంత్ రెడ్డి
రాసిపెట్టుకోండి..2034జూన్ వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మరో 8 ఏళ్లు మేమే అధికారంలో ఉంటాం. 2028 డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు రావు. 2029 జూన్‌లో జమిలి ఎన్నికలు వస్తాయి. నేను చెప్పేది రాసి పెట్టుకోండి.. 2034 జూన్ వరకూ కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది’’అని రేవంత్ అన్నారు.
విధాత, హైదరాబాద్ : రాసిపెట్టుకోండి..2034జూన్ వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)ధీమా వ్యక్తం చేశారు. మరో 8 ఏళ్లు మేమే అధికారంలో ఉంటాం. 2028 డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు రావు. 2029 జూన్‌లో జమిలి ఎన్నికలు వస్తాయి. నేను చెప్పేది రాసి పెట్టుకోండి.. 2034 జూన్ వరకూ కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది’’అని రేవంత్ అన్నారు. ఆదివారం హైదరాబాద్ లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. త్వరలోనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తాం అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ప్రతిపక్షాలు గెలిస్తే ఒరిగేమి లేదని..కాంగ్రెస్ గెలిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లోకాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలుస్తుందన్నారు.
తెలంగాణ అభివృద్ధికి అడ్డంకి కిషన్ రెడ్డి
కేంద్రంతో వివాదాలు పెట్టుకునే ఉద్దేశం మాకు లేదని, సాధించాల్సిన పనులను కేంద్రం వద్ధకు వెళ్లి పరిష్కరించుకుంటున్నామని తెలిపారు. కేంద్రం నిధులు ఇవ్వాలని అనుకుంటున్నా బీజేపీ ఎంపీలు అడ్డుకుంటున్నారని..జంట నగరాలకు నిధులు రాకుండా కిషన్ రెడ్డే అడ్డుకుంటున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
జూబ్లీహిల్స్ లో ఏటీసీ మంజూరు చేస్తాం అని తెలిపారు. సచివాలయంలో మందిరం కూలగొడితే కిషన్ రెడ్డి అప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. హిందువులంతా ఓటు వేయాలని బండి సంజయ్ అంటున్నారని..బీజేపీ డిపాజిట్ కోల్పోతే హిందువులు ఓటు వేయనట్టే కదా అని అన్నారు. జూబ్లీహిల్స్ లో బీజేపీకి డిపాజిట్ వస్తే దేశం అంతా ఆ పార్టీ గెలిచినట్లేనని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
పాస్ పోర్టు బ్రోకర్ కొడుకును ఏమనాలి
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ ను రౌడీ అని అంటున్నారని, అయితే పాస్ పోర్టు బ్రోకర్ కొడుకును ఏమనాలని సీఎం రేవంత్ రెడ్డి పరోక్షంగా కేసీఆర్, కేటీఆర్ లపై విమర్శలు చేశారు. కిషన్ రెడ్డి జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మాట్లాడే బీజేపీ లీడర్లను ఎందుకు ప్రచారానికి రానివ్వడం లేదని ప్రశ్నించారు. కేటీఆర్, కిషన్ రెడ్డి తోడు దొంగలన్నారు. మేం కేటీఆర్ ను అరెస్టు చేయాలనుకున్నామని, గవర్నర్ అనుమతి కోసం ఎదురుచూస్తున్నామని, బీజేపీ అనుమతి ఇవ్వనివ్వకుండా కేటీఆర్ ను కాపాడుతుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వం కేసును సీబీఐకి అప్పగిస్తే ఇంతవరకు ఎఫ్ఐఆర్ చేయలేదని, బీజేపీ బీఆర్ఎస్ ఫెవికాల్ బంధానికి ఇవే నిదర్శనమన్నారు. అసలు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పటిదాక ఆ పార్టీ అభ్యర్థి సునీతకు ఓటు వేయాలని జూబ్లీహిల్స్ ప్రజలను కోరలేదని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఫేక్ సర్వేలతో జనాన్ని గందరగోళం చేస్తున్నారని మండిపడ్డారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram