Revanth Reddy| కోటి మంది మహిళలను కోటిశ్వరులను చేస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

రైతులతో పాటు మహిళల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ది పథకాలను అమలు చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. నర్మెట రైతు ఉత్సవాల సభలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది నుంచి నర్సరీ నుంచి తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను రాష్ట్రంలో ప్రారంభిస్తున్నామని తెలిపారు. మళ్లీ 2029 ఎన్నికల్లో కూడా గెలుస్తామని, సిద్దిపేట నుంచి గెలిచినోళ్లను మంత్రిని చేస్తాం.. ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేస్తాం అన్నారు.

Revanth Reddy| కోటి మంది మహిళలను కోటిశ్వరులను చేస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

విధాత : రైతులతో పాటు మహిళల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ది పథకాలను అమలు చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. నర్మెట రైతు ఉత్సవాల సభలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణానికి రూ.9వేల కోట్లు ఖర్చు పెట్టిందని, ప్రతినెల రూ.350కోట్లు వెచ్చిస్తున్నామని, తద్వారా 50వేల ఆర్టీసీ కార్మికులను ఆదుకోగలిగామని, 1000 బస్సుల నిర్వహణను ఆడబిడ్డలకు అప్పగించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పెట్రోల్ బంక్ లు అప్పగించామని, 67లక్షల మంది స్వయం సహాయక సభ్యులను కోటికి పెంచి వారందరిని కోటీశ్వరులుగా చేయాలని నిర్ణయించామని వెల్లడించారు. 28నెలల్లో 57వేల కోట్లు బ్యాంక్ లింకేజీతో జీరో వడ్డీ రుణాలకు 13వేల కోట్ల రూపాయాలు చెల్లించామని తెలిపారు. సోలార్ విద్యుత్ 1000మెగావాట్లకు ఆడబిడ్డలు యజమానులయ్యారని, వారి నుంచి అదాని, అంబానీలు విద్యుత్తు కొనుగోలు చేస్తున్నారన్నారు. శిల్పారామం పక్కన వేయి కోట్ల భూమిని ఇందిరా మహిళా శక్తి స్టాల్స్ ఏర్పాటుకు కేటాయించామన్నారు. మహిళల ఆర్థి స్వావలంబనకు మా ప్రభుత్వం తోడ్పాటునందిస్తుందన్నారు. మహిళల ఆర్థిక ప్రగతితో తెలంగాణలో 2030నాటికి 3 ట్రిలియన్ డాలర్ల వ్యవస్థగా ఎదుగుతుందన్నారు.

ఈ ఏడాది నుంచే తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు

ఈ ఏడాది నుంచి నర్సరీ నుంచి తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను రాష్ట్రంలో ప్రారంభిస్తున్నామని, అవసరమైన పోషకాహారం అందిస్తామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పిస్తామన్నారు. 18వేలకు పైగా స్కూళ్లు, లక్షమందికి పైగా టీచర్లు ఉన్నారని ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ విద్యను మెరుగుపరుస్తామని తెలిపారు. ఏటీసీ ద్వారా ఉపాధి శిక్షణ కోర్సులను అందిస్తున్నామని,సాంకేతిక విద్య వైపు, ఆధునిక వ్యవసాయం వైపు మళ్లడం ద్వారా జీవితాలను మార్చుకోవాలని సూచించారు.

ఎన్నికలలో మాత్రమే రాజకీయాల్లో మాట్లాడుతానని, సిద్దిపేట, దుబ్బాక ప్రాంతాల సమస్యలను సీఎంగా పరిష్కరించే బాధ్యత తీసుకుంటానని రేవంత్ రెడ్డి తెలిపారు. రాబోయే ఖరీఫ్ పంటల సాగులో పశ్చిమాసియా యుద్దం కారణంగా యూరియా కొరత వచ్చే అవకాశం ఉందని, రాష్ట్ర బీజేపీ నేతలతో కలిసి కేంద్రంను సంప్రదించి యూరియా కొరతను ఎదుర్కోవడానికి చొరవ తీసుకోవాలని మంత్రి తుమ్మలకు సూచించారు. ఎన్నికల తర్వాత అభివృద్ది కోసం అందరం కలిసికట్టుగా పనిచేద్దాం అన్నారు. గజ్వేల్, సిద్దిపేటలలో యంగ్ ఇండియా స్కూల్, తెలంగాణ పబ్లిక్ స్కూల్, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామని గుర్తు చేశారు. నర్మెట పామాయిల్ ప్రాజెక్టును మేం వచ్చాకే నిర్మాణం ప్రారంభించామని, అభివృద్ది పనుల్లో వివక్షత ప్రదర్శించలేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో కొడంగల్ కు, మా హయాంలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుల నియోజకవర్గాలకు వచ్చన నిధులపైన చర్చ పెడుదామని, మీరు చేసినట్లుగా మేం చేయబోమన్నారు.

2029లో గెలుస్తాం..సిద్దిపేటకు వస్తం

2029లో కూడా మళ్లీ ప్రజలు మాకు అవకాశం ఇస్తారని, మళ్లీ గెలుస్తామని సిద్దిపేటకు వస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.2029 ఎన్నికల్లో సిద్దిపేట నుంచి గెలిపించే ఎమ్మెల్యేను మంత్రిగా చేస్తామని ప్రకటించారు. ఈ బాధ్యత మంత్రులు దామోదరం రాజనరసింహ, వివేక్ లదేనన్నారు. సిద్దిపేటలో మార్పు చేసి మంచి జరుగుతుందో లేదో చూడాలని కోరారు. మల్లన్న సాగర్, ఇతర ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో బీఆర్ఎస్ పాలకులు ఏ రకంగా వ్యవహరించారో అందరికి తెలుసన్నారు. ఇప్పుడు రాజకీయాల కోసం మూసీ అభివృద్దిని అడ్డుకుంటున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ముందుకు పోనియ్యమంటే నేను ఊరుకునేవాడిని కాదని, గతంలో అడ్డుపడితే సీఎం అయ్యి సిద్దిపేటకు వచ్చానని, మళ్లీ 2029లో కూడా గెలుస్తామని, సిద్దిపేట నుంచి గెలిచినోళ్లను మంత్రిని చేస్తాం.. ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేస్తాం అన్నారు. నేను రైతుబిడ్డను అని, ఏ చెట్టుకు ఏ పురుగు పడితే ఏ మందుకొట్టాలో నాకు తెలుసు అన్నారు. రైతు భరోసా నిధులను నిధుల సర్థుబాటు నేపథ్యంలో 45రోజుల్లో రూ.9వేల కోట్లను రైతుల ఖాతాల్లో వేసే బాధ్యత నాది, మీరందరి సహకారంలో తెలంగాణను ప్రగతి పథంలో తీసుకెళ్లానని స్పష్టం చేశారు.