Cyclone impact| తీరందాటిన వాయుగుండం..తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు
బంగాళాఖాతంతో నెలకొన్న వాయుగుండం దక్షిణ ఒరిస్సా-గోపాల్‌పూర్ సమీపంలో తీరం దాటింది. ఇది పశ్చిమ దిశగా ఛత్తీస్‌గఢ్ వైపు కదిలి బలహీనపడనుంది. దీంతో ఏపీకి భారీ వర్షాల ముప్పుతప్పింది. అయితే వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాలకు మరో 24 గంటల పాటు వర్ష సూచనలున్నాయి.
విధాత : బంగాళాఖాతంతో నెలకొన్న వాయుగుండం(Cyclone) దక్షిణ ఒరిస్సా-గోపాల్‌పూర్ సమీపంలో తీరం దాటింది. ఇది పశ్చిమ దిశగా ఛత్తీస్‌గఢ్ వైపు కదిలి బలహీనపడనుంది. దీంతో ఏపీకి భారీ వర్షాల ముప్పుతప్పింది. వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాలకు(AP- Telangana)మరో 24 గంటల పాటు వర్ష (Heavy Rainfall)సూచనలున్నాయి. సముద్రం కల్లకల్లోలంగా ఉన్న నేపథ్యంలో.. ఏపీలో మరో రెండు రోజులు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. వాయుగుండం ప్రభావంతో కోస్తా తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని.. ఐదు రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్ల వద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కృష్ణపట్నం ఓడరేవు మినహా మిగతా అన్ని ఓడరేవుల్లోనూ మూడో నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.నెల్లూరు మినహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుయనున్నాయని తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. అల్లూరి, కాకినాడ, పశ్చిమగోదావరి, కోనసీమ, కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కృష్ణా, గోదావరి నదుల్లో భారీగా వరద నీరు చేరే అవకాశం ఉంది. మహారాష్ట్రకు కూడా భారీ వర్ష సూచనలున్నాయి.
తెలంగాణలో జోరు వర్షాలు
వాయుగుండం, ద్రోణి ప్రభావంతో శనివారం, ఆదివారం తెలంగాణలోని అన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ(weather alert) తెలిపింది. ఈ రోజు తెలంగాణలోని హనుమకొండ, జనగాం, జోగుళాంబ గద్వాల, కామారెడ్డి, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మెదక్, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిజామాబాద్, నిర్మల్, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, కొమరం భీమ్, మంచిర్యాల, మేడ్చల్ మల్కాజ్‌గిరి, ములుగు, నల్లగొండ, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.. ఈరోజు, రేపు తెలంగాణలోని అన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుండి 60 కిలోమీటర్ల మేర ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram