న్యూఢిల్లీ : ఢిల్లీ సీఎం రేఖాగుప్తా(Delhi CM Rekha Gupta)పై దాడిattack ఘటన సంచలనం రేపింది. సీఎం అధికారిక నివాసంలో జరిగిన ‘జన్ సువాయ్’ కార్యక్రమం(Jan Suvai program) సందర్భంగా ఓ వ్యక్తి రేఖగుప్తాపై దాడి చేశాడు. ఫిర్యాదుదారుగా వచ్చిన వ్యక్తి ఆకస్మికంగా సీఎం రేఖాగుప్తాపై దాడి చేసి చెంపపై కొట్టి..జుట్టు పట్టిలాగినట్లుగా ప్రత్యక్ష సాక్షుల కథనం. ఘటనతో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది దాడికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని గుజరాత్ రాష్ట్రం రాజ్ కోట్ కు చెందిన 35ఏళ్ల రాజేష్ గా గుర్తించారు. తన తమ్ముడిని జైలు నుంచి విడుదల చేయాలని వినతి పత్రం ఇచ్చేందుకు ఆయన సీఎంను కలిసేందుకు వచ్చాడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
సీఎంపై దాడి ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. దాడిలో సీఎం రేఖా గుప్తా తలకు స్వల్పంగా గాయమైందని..ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేసినట్లుగా అధికార వర్గాలు వెల్లడించాయి. సీఎం రేఖా గుప్తాపై దాడి ఘటనను ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించాయి. సీఎంకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటంటూ ఆప్ నాయకులు విమర్శలు సంధించారు.