విధాత : తాగడానికి నీళ్లు లేక, స్థానిక అధికారులు పట్టించుకోక.. మండుటెండల్లో బావుల్లోకి దిగి, నీళ్ల కోసం పోరాడుతున్న చిన్నారుల తాగునీటి తండ్లాట దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ దృశ్యం కేంద్ర రాష్ట్రాలలో అధికారంలో ఉన్న బీజేపీ పాలిత రాష్ట్రం మధ్యప్రదేశ్‌లోని ఖార్గోన్ జిల్లా, రేఖ్లియా జిరా ఫలియాలోని సర్బద్ గ్రామంలో కావడం గమనార్హం. డబుల్ ఇంజన్ సర్కార్ తో అభివృద్ది పరుగుతీస్తుందన్న బీజేపీ నేతలు మాటలకు ఈ గ్రామంలోని ప్రజలు, చిన్నారులు పడుతున్న తాగునీటి కష్టాలు చెంప పెట్టులా కనిపిస్తున్నాయి.
లోతైన బావులలో అడుగంటిన భూగర్భ జలాలను తాగేందుకు బిందెలు, పాత్రాలు, డబ్బాలలో పైకి తెచ్చుకునేందుకు ఆ గ్రామంలోని చిన్నారులు దుస్సాహసంగా..సర్కస్ ను తలపించేలా ఉంది. వారు బావిలోని నీళ్లను పైకి తీసుకొచ్చేందుకు పడుతున్న తిప్పలు పర్వాతారోహాకుల సాహసం కంటే అధికంగానే ఉండటం విశేషం. మనసుల్ని బరువెక్కించే ఈ దృశ్యాలను చూసైనా పాలకులు అక్కడి ప్రజల తాగునీటి కష్టాలను తీర్చాలని నెటిజన్లు కోరుతున్నారు.
ఇదీ.. డబుల్ ఇంజిన్ సర్కార్‌లో పేదోడి దుస్థితి!
తాగడానికి నీళ్లు లేక, స్థానిక అధికారులు పట్టించుకోక.. మండుటెండల్లో బావుల్లోకి దిగి, నీళ్ల కోసం పోరాడుతున్న చిన్నారులు
మనసుల్ని బరువెక్కించే ఈ దృశ్యాలు.. బీజేపీ పాలిత రాష్ట్రం మధ్యప్రదేశ్‌లోని ఖార్గోన్ జిల్లా, రేఖ్లియా జిరా… pic.twitter.com/fH1GaQpnko
— PulseNewsBreaking (@pulsenewsbreak) May 24, 2026
