Bihar Elections | పీకే కు రెండు రాష్ట్రాల్లో ఓటు.. ఎలక్షన్ కమిషన్ నోటీసు!

ఎన్నికల వ్యూహకర్తగా పేరు పొందిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు కొత్తగా పార్టీ పెట్టి రాజకీయ నేత అవతారమెత్తాడు. జన్ సురాజ్ పార్టీ స్థాపించిన ఆయన ఇప్పుడు మరోవివాదంలో చిక్కారు. రెండు రాష్ట్రాల ఓటర్ల జాబితాలో పీకే (ప్రశాంత్ కిషోర్) పేరు ఉండడంతో ఎన్నికల కమిషన్ నోటీసు జారీ చేసింది.

Bihar Elections | పీకే కు రెండు రాష్ట్రాల్లో ఓటు.. ఎలక్షన్ కమిషన్ నోటీసు!

న్యూఢిల్లీ :

ఎన్నికల వ్యూహకర్తగా పేరు పొందిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు కొత్తగా పార్టీ పెట్టి రాజకీయ నేత అవతారమెత్తాడు. జన్ సురాజ్ పార్టీ స్థాపించిన ఆయన ఇప్పుడు మరోవివాదంలో చిక్కారు. రెండు రాష్ట్రాల ఓటర్ల జాబితాలో పీకే (ప్రశాంత్ కిషోర్) పేరు ఉండడంతో ఎన్నికల కమిషన్ నోటీసు జారీ చేసింది. ఇది ప్రజా ప్రతినిధ్య చట్టం, 1950 నిబంధనలకు వ్యతిరేకమని కమిషన్ పేర్కొంది. కిషోర్ పేరు ఆయన సొంత రాష్ట్రం బీహార్ తో పాటు పశ్చిమ బెంగాల్ లో ఓటర్ల జాబితాలో ఉండడం చర్చనీయాంశంగా మారింది. కాగా, గతంలో తృణముల్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహ కర్తగా వ్యవహరించిన సమయంలో పశ్చిమ బెంగాల్ లో పీకే కు ఓటు హక్కు లభించింది. కోల్ కత్తాలోని భవానీపూర్ నియోజకవర్గం పరిధిలోని ఉన్న నిర్మల్ హృదయ్ స్కూల్, బీడన్ స్ట్రీట్ ఓటర్ల జాబితాలో ప్రశాంత్ కిషోర్ పేరు నమోదైందని, అలాగే, పీకే సొంత రాష్ట్రమైన బీహార్ లోని రోహ్తాస్ జిల్లా కర్గహర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓటర్ల జాబీతాలో కూడా ఆయన పేరు నమోదైందని ఈసీ పేర్కొంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)లో భాగంగా దేశ వ్యాప్తంగా ఓటరు జాబితా ప్రక్రియను సవరణ చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే ప్రశాంత్ కిషోర్ కు ఈసీ నోటుసు జారీ చేసింది.

అయితే, రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉండడం ప్రజాప్రాతిధ్య చట్టం, 1950లోని సెక్షన్ 17 ప్రకారం నేరంగా పేర్కొంది. ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో ఓటు కలిగి ఉండకూదనే నిబంధను ఉల్లంఘిస్తే శిక్షార్హులవుతారని ఈసీ నోటీసుల్లో వెల్లడించింది. పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్టు, 1950లోని సెక్షన్ 31 ప్రకారం జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండింటినీ విధించే అవకాశం ఉంటుందని హెచ్చిరించింది. ఈ అంశంపై మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఎలక్షన్ కమిషన్ ప్రశాంత్ కిషోర్ ను ఆదేశించింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ లో పీకేకు అక్కడ ఓటు హక్కు లభించింది. అయితే, ప్రస్తుతం బీహార్ ఎన్నికల్లో పాల్గొంటున్నందున బెంగాల్ లో ఓటును రద్దు చేయించుకోవాల్సి ఉంటుంది.