షాకింగ్..హైదరాబాద్ నగరంలో మరో నేపాలీ గ్యాంగ్ దోపిడీ
ఇటీవలే రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్యను దారుణ హత్య చేసి, నగలు, నగదుతో పరారైన నేపాలీ గ్యాంగ్ కిరాతకం మరువకముందే..ఇదే తరహాలో నేపాలీ గ్యాంగ్ నగరంలో మరో దోపిడీకి పాల్పడటం సంచలన రేపింది.
విధాత, హైదరాబాద్ : ఇటీవలే రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్యను దారుణ హత్య చేసి, నగలు, నగదుతో పరారైన నేపాలీ గ్యాంగ్ కిరాతకం మరువకముందే..ఇదే తరహాలో నేపాలీ గ్యాంగ్ నగరంలో మరో దోపిడీకి పాల్పడటం సంచలన రేపింది.
జవహర్‌నగర్‌లోని కౌకుర్ గోల్ఫ్ ఎన్‌క్లేవ్‌లో నేపాల్ గ్యాంగ్ సినీ ఫక్కీలో దోపిడీకి పాల్పడింది. మేడ్చల్ జిల్లా ఎన్‌క్లేవ్‌లో నివాసముంటున్న ప్రొ.మురళీధర్ మోహన్(68),, డాక్టర్ విజయలక్ష్మి (58)దంపతులకు పథకం మేరకు నేపాలీ గ్యాంగ్ దాడి చేసి కట్టేసి దోపిడీకి పాల్పడింది. ఆ తర్వాతా వారికి మత్తుమందు ఇచ్చి 60 తులాల బంగారం, వెండితో పాటు రూ.30 వేల నగదు చోరీ చేసి ఉడాయించారు. మత్తు నుంచి తేరుకున్న దంపతులు కిటికీలో నుంచి అరువడంతో ఇరుగుపొరుగు వారిని రక్షించారు. అనంతరం వారు జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ప్రొ.మురళీధర్ మోహన్, డాక్టర్ విజయలక్ష్మిల కథనం మేరకు నేపాల్‌కు చెందిన ఓ జంట 13 రోజుల క్రితం తమ ఇంట్లో పని మనుషులుగా చేరారు. భీమ్ అనే ఎజెంట్ ద్వారా మమత అనే నకిలీ పేరుతో ఇటీవలే మరో మహిళ వచ్చి వారి బంధువుగా పరిచయమై తమ ఇంట్లో ఉంటుంది. సోమవారం రాత్రి నేపాలీ మహిళ జన్మదిన వేడుకలు చేసుకుంటామంటే అంగీకరించామని, దాంతో మరో ముగ్గురు బయట నుంచి వచ్చారని బాధితులు తెలిపారు. వేడుకల అనంతరం భోజనం చేస్తుండగా వెనుక నుంచి వచ్చి తమపై నేపాలీ గ్యాంగ్ దాడికి పాల్పడిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. భయాందోళనకు గురై మమ్మల్ని ఏమి చేయకండి అంటూ ‘మీకు ఏమి కావాలో తీసుకోండి’ అని చెప్పారు.
అనంతరం మత్తు మందు కలిపిన పదార్థాలను వారి చేత బలవంతంగా తినిపించారు. తర్వాత గదిలోకి తీసుకెళ్లి ఇద్దరిని కట్టిపడేసి ఆటోలో పరారయ్యారు. మత్తు మందు ప్రభావంతో దంపతులు మంగళవారం మధ్యాహ్నం వరకు అలానే ఉన్నట్లు సమాచారం. అన్ని గేట్లకు పకడ్బందీగా తాళాలు వేసి దుండగులు పారిపోయినట్లు తెలిసింది. మధ్యాహ్నం కాలనీలో ఇంటివైపు వచ్చిన స్థానికులను గుర్తించిన ప్రొఫెసర్ కిటికీలో నుంచి అరవడంతో వారొచ్చి తలుపులు తీశారు. ఈ దోపీడీలో సుమారు ఏడుగురు పాల్గొన్నట్లు సమాచారం. మల్కాజిగిరి పోలీసు కమిషనర్ సుమతి ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram