Jagadish Reddy| మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఇంట్లో మూడుతరాల రాఖీ వేడుక

విధాత : మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి( Jagadish Reddy)ఇంట్లో రాఖీ పౌర్ణమి వేడుకలు(Rakhi Festival) వెరివెరిస్పెషల్ గా సాగాయి. అన్నా చెల్లెళ్లు..అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే రాఖీ పండుగ వేడుకలు మంత్రి జగదీష్ రెడ్డి నివాసంలో ముచ్చటగా మూడు తరాల అత్మీయానుబంధాల వేడుక(Three Generations Celebration)గా నిలవడం విశేషం.
గుంటకండ్ల కుటుంబంలోని మూడు తరాల సోదరీ సోదరులు ఒక్కచోట చేరి రాఖీలు కట్టుకుని తమ ప్రేమానుబంధాలను చాటుకున్నారు. జగదీష్ రెడ్డి తండ్రి గుంటకండ్ల రామచంద్రారెడ్డికి ఆయన అక్కాచెల్లెళ్లు రాఖీ కడితే.. జగదీష్ రెడ్డికి తన అక్క రాఖీ కట్టింది. అలాగే జగదీష్ రెడ్డి కుమారుడు వేమన్ రెడ్డికి ఆయన చెల్లెలు లహరి రాఖీ కట్టారు. ఇలా జగదీష్ రెడ్డి ఇంట్లో రాఖీ పండుగ మూడు తరాల అనుబంధాలకే వేదికగా నిలవడం వైరల్ గా మారింది.
నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి మండలం పల్లెపహాడులో జరిగిన మూడు తరాల రాఖీ సంబరంలో తొంభై ఆరేళ్ళ కల్మెకొలను అండమ్మ తన తమ్ముడు గుంటకండ్ల రామచంద్ర రెడ్డి(93) కి రాఖీ కట్టారు. రామచంద్రారెడ్డికి మరో సోదరి కడారు వసంత(81) కూడా రాఖీ కట్టారు. రామచంద్రారెడ్డి తనయుడైన మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డికి తన సోదరి కట్టా రేణుక రాఖీ కట్టారు. జగదీష్ రెడ్డి తనయుడు వేమన్ రెడ్డికి తన సోదరి లహరి రాఖీ కట్టాడం విశేషం.