Komatireddy Rajagopal Reddy| మీ కోసం త్యాగానికి సిద్ధం..మీరు సిద్ధంకండి: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

విధాత : మీ కోసం నేను మరోసారి ఎంతటి త్యాగాని(Sacrifice)కైనా సిద్దంగా ఉన్నానని.. మీరు కూడా సిద్ధంగా ఉండండి అని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే(Munugode Congress MLA) కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy )మళ్లీ హాట్ కామెంట్స్ చేశారు. మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే ఎలాంటి పోరాటానికైనా సిద్ధం అని స్పష్టం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రంలో నారాయణపురం మండల కేంద్రంలో ఉన్న కస్తూరిభా బాలికల పాఠశాలలో 62 లక్షల వ్యయంతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం త్రిబుల్ ఆర్ రైతుల(RRR Farmers Issues) సమస్యలపై రాజగోపాల్ రెడ్డి వారితో సమావేశమయ్యారు. త్రిబుల్ ఆర్ లో భూములు కోల్పోతున్న చౌటుప్పల్ డివిజన్ రైతులు తొక్కని గడపలేదన్న సంగతి వాస్తవమన్నారు. రాజగోపాల్ రెడ్డి గట్టివాడు కొట్లాడుతాడు అనే అభిప్రాయం మీకు ఉందని..గతంలో మునుగోడు నియోజకవర్గానికి నిధులు రాకపోతే రాజీనామా చేసి ప్రభుత్వాన్ని మీ కాళ్ళ దగ్గర పెట్టానన్నారు. నా రాజీనామా వల్ల చౌటుప్పల్- నారాయణపూర్ రోడ్డు జరిగిందని..చౌటుప్పల్ కి వంద పడకల ఆసుపత్రి,, గట్టుప్పల్ మండలం, చండూరు రెవిన్యూ డివిజన్, శివన్న గూడెం రిజర్వాయర్ భూమి నిర్వాసితులకు డబ్బులు రావడం జరిగిందని గుర్తు చేశారు. నేను రాజీనామా చేస్తే మునుగోడు నియోజకవర్గానికి ఇవన్నీ జరిగినాయన్న సంగతి మరువరాదన్నారు.
నాకు మంత్రి పదవి(Ministerial Post Assured)పై హామీ ఇచ్చిన మాట వాస్తవం..కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు మంత్రి పదవి ఇస్తానన్నారని..ఆలస్యమైన సరే పర్వాలేదు, నేను ఎదురు చూస్తాను.. నాకు ఓపిక ఉందని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. నాకు అన్యాయం జరిగిన పర్వాలేదు.. కానీ మునుగోడు ప్రజలకు మాత్రం అన్యాయం జరిగే పని చేస్తే.. నా నిర్ణయం ఎంత దూరమైన పోతుందన్నారు. రాజగోపాల్ రెడ్డిని తక్కువ చేయడం అనేది ఎవరి వల్ల కాదన్నారు. ఎక్కడికి అక్కడ ప్రభుత్వం స్తంభిస్తేనే మీ సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు. ఇందుకోసం మరొకసారి అవసరమైతే ఎంత త్యాగమైనా చేయడానికి రాజగోపాల్ రెడ్డి సిద్ధం.. మీరు కూడా సిద్ధంగా ఉండండని సూచించారు. నేను అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను అని..నియోజకవర్గానికి అన్యాయం జరిగితే నేను ప్రభుత్వంతో పోరాటడానికి సిద్ధంగా ఉన్నానని స్పషట్ంం చేశారు.
నేను లాలూచీపడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్లి పదవి ఇస్తే చప్పుడు చేయకుంటా కూర్చునే వ్యక్తిని కాదని.మా రైతులకు అన్యాయం జరిగితే పదవి వద్దు.. పైసలు వద్దు, నా ప్రాంత ప్రజలే ముఖ్యమని చెప్తానన్నారు. ఇందులో ఏలాంటి అనుమానం అవసరం లేదని..మీకు న్యాయం జరిగేంతవరకు మీ వెంట నేను ఉంటానని త్రిబుల్ ఆర్ రైతులకు రాజగోపాల్ రెడ్డి భరోసా ఇచ్చారు. 2018 లో చెప్పాను.. మళ్లీ చెప్తున్నా.. నేను మీ ఇంట్లో సభ్యుడిగా వచ్చాను.. మీ ఇంట్లో సమస్య ఉంటే దానికోసం పోరాడే వ్యక్తిని అని తెలిపారు. త్రిబుల్ ఆర్ అనేది పెద్ద విషయం అని..ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవచ్చి మీకు న్యాయం జరిగే విధంగా కృషి చేస్తాను అని భరోసా ఇచ్చారు. ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం జరుగుతుంది అంటే నేను ఎంత దూరమైన వెళ్తా ఎంత త్యాగమైనా చేసే ఎంత పోరాటానికైనా సిద్ధం అని రాజగోపాల్ రెడ్డి పునరుద్ఘాటించారు.