Jubilee Hills By-Election| జూబ్లీహిల్స్‌లో నవీన్ యాదవ్ కు 15,589ఓట్ల ఆధిక్యం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. రౌండ్ రౌండ్ కు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మెజార్టీ పెరుగుతుంది. ఆరో రౌండ్ ముగిసే సరికి నవీన్ యాదవ్ కు 15,589ఓట్ల మెజార్టీ లభించింది.
విధాత, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల(Jubilee Hills By-Election) ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. రౌండ్ రౌండ్ కు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్( Naveen Yadav Lead)కు మెజార్టీ పెరుగుతుంది. ఆరవ రౌండ్ ముగిసే సరికి నవీన్ యాదవ్ కు 15,589ఓట్ల మెజార్టీ లభించింది. ఆరో రౌండ్ లో నవీన్ యాదవ్ కు సమీప బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునితపై 2,938ఓట్ల మెజార్టీ దక్కింది. బీజేపీ అభ్యర్థి లెంకల దీపక్ రెడ్డి మూడో స్థానంలో కొనసాగుతున్నారు. బీజేపీకి పోలైన ఓట్ల 2023సాధారణ ఎన్నికలతో పోలిస్తే మరింత తగ్గిపోయింది. నాలుగు రౌండ్లలో బీజేపీకి 7,296 ఓట్ల మాత్రమే పోలయ్యాయి. దీంతో ఆ పార్టీ అభ్యర్థి లెంకల దీపక్ రెడ్డి కౌంటింగ్ హాల్ నుంచి వెళ్లిపోయారు.
బీజేపీకి తగ్గిన ఓట్ల శాతంపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు మీడియాతో స్పందించారు.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీకి గెలుపుపై అంచనాలు లేవని, మా ఓటు బ్యాంకు కాపాడుకునేందుకు, పార్టీ ప్రాతినిధ్యం కోసం, రాజకీయాల్లో మా సైద్దాంతిక ప్రచారాన్ని వినిపించేందుకు పోటీలోకి దిగామన్నారు. అభ్యర్థి లెంకల దీపక్ రెడ్డి స్పందిస్తూ బీజేపీ గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ప్రజలకోణంలో రాజకీయాలు చేస్తుందన్నారు. ఎన్నికల్లో మేం ఎలాంటి ప్రలోభాలకు పాల్పడలేదన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram