CBI Trap| సీబీఐకి చిక్కిన నేషనల్ హైవే అథార్టీస్ పీడీ
విధాత : హైదరాబాద్ నేషనల్ హైవే అథార్టీస్(NHAI) ప్రాజెక్టు డైరెక్టర్(PD) గొల్ల దుర్గాప్రసాద్ సీబీఐ వల(Trap)కు చిక్కారు. సీబీఐ(CBI)కి దొరికిపోయారు. బీబీనగర్ టోల్ ప్లాజా వద్ద ఉన్న రెస్టారెంట్ ఓనర్ నుంచి రూ.60 వేలు లంచం(Corruption) తీసుకుంటూ దుర్గాప్రసాద్ సీబీఐ అధికారులకు దొరికిపోయాడు. హైవే పక్కన రెస్టారెంట్ నడిపిస్తున్నందుకు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు సీబీఐని ఆశ్రయించడంతో వారు పక్కా ప్రణాళిక మేరకు అవినీతి అధికారి ఆట కట్టించారు.
ప్రస్తుతం దుర్గప్రసాద్ ను అరెస్టు చేసిన సీబీఐ అధికారులు ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నారు. అనంతరం దుర్గా ప్రసాద్ కు చెందిన హైదరాబాద్, వరంగల్, సదాశివపేటలో దుర్గా ప్రసాద్ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేపట్టారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram