విధాత : రైలు నుంచి బాలుడు కింద పడిపోయిన క్రమంలో చైన్ లాగినా లోకో పైలట్ రైలు ఆపని ఘటన భారత రైల్వేశాఖ పనితీరును ప్రశ్నార్ధకం చేస్తూ..నెట్టింటా తీవ్ర విమర్శల పాలవుతుంది. జల్పాయ్ గురి – రామ్ నగర్ రూట్‌లో కదులుతున్న రైలు నుంచి సామాన్లతో బాలుడు ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. వెంటనే అతని సోదరి తమ్ముడి కోసం కేకలు వేస్తూ తోటి ప్రయాణికుల సహాయం కోసం ఆర్థించింది. వారు సకాలంలో స్పందించి రైలులోని అత్యవసర చైన్ ను లాగారు. అయినప్పటికి లోకో పైలట్ రైలు ఆపకుండా అలాగే 15కిలోమీటర్ల వరకు వెళ్లిపోయాడు. కోచ్ లోని ఇతర ప్రయాణికులు కూడా పదేపదే చైన్‌ను లాగారు. కానీ రైల్వే బ్రేక్ వ్యవస్థ స్పందించలేదు.
టీటీఈ(TTE)ని సహాయం కోసం అభ్యర్థించినప్పటికి అతడు చోద్యం చూస్తూ ఉండిపోయాడే తప్ప సాయం చేయకపోవడం, హెల్ప్‌లైన్ నుంచి సరైన స్పందన కూడా రాకపోవడం మరింత విచారకరం. ఈ ఘటన రైల్వే సిబ్బంది నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచింది. రైలు ఆపకపోవడం..కింద పడిపోయి తన సోదరుడి పరిస్థితి ఏమైందోనన్న బాధతో సోదరి చేసిన రోధన రైలు ప్రయాణికులతో పాటు వీడియో చూసిన నెటిజన్లను కలిచి వేసింది. దీంతో రైల్వేశాఖ నిర్లక్ష్యపు పనితీరుపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
సంఘటన జరిగిన సమయంలో కోచ్‌లో ఉన్న ఒక యువకుడు వెంటనే ఆర్పీఎఫ్‌కు, స్థానిక పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. అతను మొత్తం సంఘటనను వీడియో తీసి, “మేము అందరికీ ఫోన్ చేశాం అని, చైన్ లాగుతున్నాం, కానీ రైలు ఆగడం లేదు” అని చెబుతూ తన నిస్సహాయతను వ్యక్తం చేశాడు. రైలు ఆగకపోవడంతో, ఆ సోదరి తన సోదరుడి వద్దకు చేరుకోలేక కన్నీళ్లతో రైలులోనే కూర్చుండిపోవాల్సి వచ్చింది. తర్వాత రైలు తర్వాతి స్టేషన్‌కు చేరుకునే వరకు ఆమెకు ఎలాంటి అధికారిక సహాయం అందలేదని సమాచారం. ఆ తర్వాత పోలీసులు, రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని బాలుడి కోసం గాలింపు మొదలుపెట్టారు.
తీవ్ర విషాదం.. కదులుతున్న రైలు నుంచి కింద పడ్డ బాలుడు
ఎమర్జెన్సీ చైన్ లాగినా.. టీటీఈని సాయం కోరినా.. ఏ ఒక్కరూ సహాయం చేయని దౌర్భాగ్యం
జల్పైగురి – రామ్‌నగర్ రూట్‌లో.. కదులుతున్న రైలు నుంచి లగేజ్ సహా కింద పడ్డ బాలుడు
ఓ మహిళ కేకలు వేయగా.. ఇతర ప్రయాణికులు ఎమర్జెన్సీ చైన్ లాగినా… pic.twitter.com/15ZPz34OOL
— PulseNewsBreaking (@pulsenewsbreak) April 27, 2026
ఇవి కూడా చదవండి :
ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరామ్ ప్రమాణస్వీకారం
సైకిల్ ట్రాక్ పై మహిళకు వేధింపులు..హైదరాబాద్ లో ఘటన
