Rythu Bharosa| రైతు భరోసా నిధులను విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి సాయంగా అందించే రైతుభరోసా నిధులను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విడుదల చేశారు. సిద్దిపేట జిల్లా నర్మెటలో నిర్వహించిన సభలో తొలి విడతగా రూ.3,590 కోట్లు విడుదల చేశారు. వీరందరికీ ఒక ఎకరం రూ. 6వేల చొప్పున రూ.3,590 కోట్లు ఆదివారం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఆదివారం సెలవు కావడంతో సోమవారం అన్నదాతల ఖాతాల్లో జమవుతాయి.

Rythu Bharosa| రైతు భరోసా నిధులను విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి

విధాత: రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి సాయంగా అందించే రైతుభరోసా నిధులను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విడుదల చేశారు. సిద్దిపేట జిల్లా నర్మెటలో నిర్వహించిన సభలో తొలి విడతగా రూ.3,590 కోట్లు విడుదల చేశారు. ఈ పథకం కింద 1.50 కోట్ల ఎకరాలకు సాయం అందించేందుకు రూ.9 వేల కోట్లను ప్రభుత్వం సమకూర్చింది. రాష్ట్రంలోని మొత్తం 73 లక్షల మంది రైతులకు ఈ నిధులను మూడు విడతల్లో పంపిణీ చేయనున్నారు. వీరందరికీ ఒక ఎకరం రూ. 6వేల చొప్పున రూ.3,590 కోట్లు ఆదివారం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఆదివారం సెలవు కావడంతో సోమవారం అన్నదాతల ఖాతాల్లో జమవుతాయి. ఆర్బీఐ ద్వారా బ్యాంకులకు.. అటు నుంచి రైతుల ఖాతాల్లోకి ఈ నిధులు చేరనున్నాయి. మరో 20 రోజుల అనంతరం రెండో విడతలో రూ.2,650 కోట్లు, మూడో విడతలో రూ.2,760 కోట్లు విడుదల చేస్తారు. రాష్ట్రంలోని మొత్తం రైతుల్లో 24.32 లక్షల మందికి ఎకరం వరకు, 48.68 లక్షల మందికి ఎకరం కంటే ఎక్కువ వ్యవసాయ భూములు ఉన్నాయని వ్యవసాయ శాఖ వెల్లడించింది.

రైతుల కోసం నెలకు రూ. 5,500కోట్లు ఖర్చు చేస్తున్నాం : సీఎం రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ సీఎం కేసీఆర్ రైతు సంక్షేమం కోసం ప్రతి నెలా రూ.2,533 కోట్లు ఖర్చు పెడితే.. ప్రజా ప్రభుత్వం వచ్చిన 28 నెలల్లో ప్రతి నెలా రూ.5,500 కోట్లు ఖర్చు పెడుతున్నాం అని, ఇప్పటికే రూ.1లక్ష 40వేల కోట్ల వరకు ఖర్చుచేశామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. 62 ఎకరాలకుపైగా విస్తీర్ణంలో రూ.300 కోట్లతో ఈ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టారు.అలాగే రూ.80 కోట్లతో నర్మెటలో పామాయిల్‌ రిఫైనరీ ప్లాంట్‌ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన రైతు ఉత్సవాలు బహరంగ సభలో రైతు భరోసా నిధులు విడుదల చేసి ప్రసంగించారు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం,

రైతు ఏడ్చిన రాజ్యం సుభిక్షంగా ఉండదు అని, ప్రజా పాలనలో ఎన్ని సమస్యలు ఎదురైనా రైతులకు సంబంధించిన ఏ సంక్షేమ పథకాన్ని ఆపలేదు అని స్పష్టం చేశారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇప్పించి రైతుల కళ్లల్లో ఆనందం చూడాలని మా ప్రభుత్వం ఆలోచిస్తుంది అన్నారు. ఉచిత విద్యుత్తు, రూ.2లక్షల రుణమాఫీ, సన్న ధాన్యానికి రూ. 500 బోనస్, రైతు బీమా, ప్రకృతి వైపరిత్యాలకు పంట నష్టపరిహాం వంటి పథకాలను అమలు చేస్తున్నామన్నారు.

వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేయండి

వరి సాగులో 2కోట్ల 58లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తితో దేశంలోనే నెంబర్ వన్ గా నిలబడ్డామని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అందరు వరి వేయకుండా.. వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు వేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రాంత రైతులు కమర్షియల్ పంటలు వేయడంలో ప్రావిణ్యులని, చెరుకు, పసుపు, మొక్కజొన్న, సోయాబిన్ వంటి పంటలు పండించేవారన్నారు. ఇప్పుడు ఇక్కడ రూ.750కోట్లతో పామాయిల్ ప్యాక్టరీ ఏర్పాటైందని, ప్రస్తుతం 3లక్షల ఎకరాల వరకు పామాయిల్ తోటలు సాగు చేస్తున్నారని, దీనిని 10లక్షల ఎకరాల వరకు విస్తరించాలని సూచించారు. కూరగాయాలు, పండ్ల తోటలు, పాల దిగుబడి వైపు రైతులు మళ్లాల్సిన అవసరం ఉందన్నారు. వాటి దిగుమతి తగ్గించడంలో రైతులు తమవంతు ఆలోచన చేసి ఆయా పంటలన సాగు చేయాలని కోరారు.

ప్రపంచ దేశాలకు తెలంగాణ ధాన్యం సరఫరా చేసినా ఇంకా మిగులు ధాన్యం ఉంటుందని,కేంద్రం ఈ ధఫా 50లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే వరి ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పారని, ఇప్పటికే ఈ ఏడాది 71లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, పేదలకు సన్నబియ్యం పంపిణీ చేశాక కూడా ఇంకా లక్ష మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం మిగిలిపోతుందని, విదేశాలకు ఎగుమతి లాభసాటి లేదని, ఈ పరిస్థితుల్లో రైతులు పంట మార్పిడి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

పామాయిల్ తోటల దిగుబడి వచ్చేవరకు రైతులకు కేంద్రం ఇచ్చే సహకారానికి తమవంతుసహకారం అందిస్తాం అని రేవంత్ రెడ్డి తెలిపారు. సిద్దిపేట తరహాలో మా కొడంగల్ లో కూడా ఓ పామాయిల్ ఫ్యాక్టరీ కట్టాలని మంత్రి తుమ్మలను కోరుతున్నానని తెలిపారు. పామాయిల్ లాభసాటి వ్యవసాయం అని స్పష్టం చేశారు. తెలంగాణలోని అన్ని గ్రామాల రైతులు అంకాపూర్ రైతులను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. భారత వ్యవసాయ పరిశోధన కేంద్రం ఇక్రిసాట్ సైతం మెదక్ జిల్లాలోనే ఉందని గుర్తు చేశారు. ఆధునిక ఆలోచనలతో వ్యవసాయం చేస్తే ఐటీ ఉద్యోగులకంటే ఎక్కువ ఆదాయం సంపాదించవచ్చన్నారు.