Riaz Arrest| రౌడీ షీటర్ రియాజ్ అరెస్టు
నిజామాబాద్ లో కానిస్టేబుల్ ప్రమోద్ ని కత్తితో పొడిచి చంపి చంపి, అతని మేనల్లుడు, ఎస్సై విఠల్‌ను తీవ్రంగా గాయపరిచి పారిపోయిన రౌడీషీటర్ రియాజ్ ను పోలీసులు అరెస్టు చేశారు.
విధాత : నిజామాబాద్(Nizamabad)లో కానిస్టేబుల్ ప్రమోద్ ని కత్తితో పొడిచి చంపి చంపి, అతని మేనల్లుడు, ఎస్సై విఠల్‌ను తీవ్రంగా గాయపరిచి పారిపోయిన రౌడీషీటర్ రియాజ్ (Rowdy sheeter Riaz)ను పోలీసులు అరెస్టు(Arrest) చేశారు. సారంగాపూర్ శివారులో రియాజ్ ని పట్టుకునేందుకు యత్నించిన ఓ యువకుడిపై అతను కత్తితో దాడి దిగాడు. అంతలోపునే వేగంగా వచ్చిన పోలీసులు రియాజ్ ను అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడిపై గత మూడేళ్లలో ఏకంగా 40 కేసులు నమోదైనట్టు పోలీసులు వెల్లడించారు. బాల్యంలోనే తండ్రిని కోల్పోయిన రియాజ్ యుక్త వయసు నుంచే నేరాల బాటపట్టాడని.. మూడుసార్లు జైలుకు వెళ్లి బెయిలుపై తిరిగొచ్చాడని తెలిపారు. ఖరీదైన బైక్ లను ఎక్కువగా చోరీ చేసి, వాటి ఛాసిస్ నెంబర్లు మార్చి అమ్ముకునే వాడన్నారు. డీఐజీ అదేశాలతో రియాజ్ ను పట్టుకునేందుకు తొమ్మిది బృందాలను ఏర్పాటు చేసి 24గంటల్లోనే అతడిని అరెస్టు చేశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram