Yedupayala Vanadurga Temple| సింగూర్ ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తివేత..జల దిగ్బంధంలో ఏడుపాయల వనదుర్గ ఆలయం
విధాత: భారీ వర్షాలు..వరదల నేపధ్యంలో మెదక్ జిల్లా సింగూర్ ప్రాజెక్టు(Singur Project) జలాశయం 5గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. సింగూర్ ప్రాజెక్టు గేట్లను ఎత్తడంతో దిగువన ఉన్న ఏడుపాయల వనదుర్గ ఆలయం(Yedupayala Vanadurga Temple) జలదిగ్భంధంలో చిక్కుకుంది. మంజీరా నది వరద(Manjeera River) ఉదృతి పెరిగిపోగా..ఏడుపాయల దుర్గమ్మ ఆలయం దగ్గర 43,809 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతుంది.
దుర్గమ్మ పాదాలను తాకుతూ వరద ప్రవాహం సాగుతుంది..దీంతో ఆలయానికి భక్తుల సందర్శనను నిలిపివేశారు. వరద ప్రవాహం తగ్గాక తిరిగి ఆలయాన్ని తెరుస్తామని అధికారులు తెలిపారు. రాజగోపురంలోని ఉత్సవ విగ్రహానికి పూజలు కొనసాగుతున్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram