Alcohol Consumption | తాగుడులో దక్షిణాది రాష్ట్రాలు టాప్.. దేశ వినియోగంలో 58 శాతం!
దేశంలో ఉత్తరాది, ఈశాన్య, పశ్చిమ రాష్ట్రాలతో పోల్చితే మద్యం సేవించడంలో దక్షిణాది రాష్ట్రాలు టాప్ లో ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రా, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలతో పాటు పుదుచ్ఛేరి కేంద్ర పాలిత ప్రాంతంలో అత్యధికంగా తాగుతున్నారు. దేశ వినియోగంలో 58 శాతం విక్రయాలు ఈ రాష్ట్రాలలో జరుగుతున్నాయి.
 
                                    
            హైదరాబాద్, విధాత
దేశంలో ఉత్తరాది, ఈశాన్య, పశ్చిమ రాష్ట్రాలతో పోల్చితే మద్యం సేవించడంలో దక్షిణాది రాష్ట్రాలు టాప్ లో ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రా, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలతో పాటు పుదుచ్ఛేరి కేంద్ర పాలిత ప్రాంతంలో అత్యధికంగా తాగుతున్నారు. దేశ వినియోగంలో 58 శాతం విక్రయాలు ఈ రాష్ట్రాలలో జరుగుతున్నాయి. ఇందులో కర్నాటక రాష్ట్రం జాతీయ స్థాయిలో 17 శాతం వాటాను కలిగి ఉండడం విశేషం. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అల్కహాలిక్ బెవరేజ్ కంపెనీస్ గణాంకాల ప్రకారం ఆర్థిక సంవత్సరం మార్చి 31వ తేదీ ముగింపు నాటికి ఐఎంఎఫ్ఎల్ కు చెందిన 23.18 కోట్ల కేసులను దక్షిణాది రాష్ట్రాలలో విక్రయించారు.
ఐఎంఎఫ్ఎల్ పరిధిలో విస్కీ, వోడ్కా, రమ్, జిన్ తో పాటు బ్రాండీ ఉత్పత్తులు వస్తాయి. ఇవి పోగా మిగతా 42 శాతం ఐఎంఎఫ్ఎల్ ను మిగతా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు విక్రయించాయి. అంతకు ముందు ఏడాదితో పోల్చితే 2025 ఆర్థిక సంవత్సరంలో విస్కీ విక్రయాలు 1.4 శాతం తగ్గాయి. 40.17 కోట్ల కేసుల నుంచి 39.62 కేసులు తగ్గినట్లు పేర్కొన్నారు. ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో జనరల్ ఎలక్షన్లు, ఎక్సైజ్ పాలసీల కారణంగా అమ్మకాలు నెమ్మదించాయి. ప్రతి సంవత్సరం కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పాలసీలు మార్చేసి పన్నులు పెంచడం మూలంగా అమ్మకాలపై ప్రభావం చూపిస్తున్నాయి. ఐఎంఎఫ్ఎల్ విస్కీ విక్రయాల్లో కర్నాటక మొదటి స్థానంలో ఉండగా తమిళనాడు రెండో స్థానంలో ఉంది. ఆ తరువాతి స్థానాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో 9 శాతం చొప్పున అమ్మకాలు జరుగుతున్నాయి.
కేరళ రాష్ట్రం ఏడవ స్థానంలో ఉండగా, దక్షిణాది రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరం 1 శాతం అమ్మకాలు పెరుగుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల వాటా 20 శాతం కాగా ఉత్తరప్రదేశ్ లో 2.50 కోట్ల కేసులు విక్రయించారు. విక్రయాల్లో తక్కువగా ఉన్నప్పటికీ పెరుగుదల 6 శాతం నమోదు అయ్యింది. రాజస్థాన్ లో 1.37 కోట్ల కేసులు, ఢిల్లీలో 1.18 కోట్లు, హర్యానాలో 1.17 కోట్ల కేసులు అమ్ముడయ్యాయి. ఝార్ఖండ్ లో 15 శాతం, రాజస్థాన్ లో 15 శాతం, పుదుచ్చేరి లో 10 శాతం పెరుగుదల ఉంది.
రాష్ట్రాల వారీగా అత్యధికంగా మద్యం సేవించే వారిలో
ర్యాంకు    రాష్ట్రం                                    మహిళల శాతం                        పురుషుల శాతం
1           అరుణాచల్ ప్రదేశ్                              24.2                                      52.7
2           తెలంగాణ                                           6.7                                       43.3
3           సిక్కిం                                              16.2                                       39.8
4            గోవా                                                 5.5                                       36.9
5           మణిపూర్                                             0.9                                    37.5
6           ఝార్ఖండ్                                           6.1                                        35.0
7           ఛత్తీస్ గఢ్                                          5.0                                        34.8
8          త్రిపుర                                                6.2                                        33.1
9          హిమాచల్ ప్రదేశ్                                    0.6                                     31.9
10        మేఘాలయ                                       1.5                                         32.4
అరుణాచల్ ప్రదేశ్ లో గిరిజన తెగల ఆచారం..
కొండ ప్రాంతమైన అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు ఎక్కువగా ఆల్కహాలు తీసుకుంటారు. పురుషులు కూడా అధికంగా సేవిస్తున్నారు. ఆల్కహాలు తీసుకోవడం గిరిజన తెగల ఆచారంగా వస్తున్నది. మహిళలలో 24.2 శాతం, పురుషులలో 52.7 శాతం సేవిస్తున్నారు. పండుగలు, పర్వ దినాలలో సంప్రదాయక మద్యం అయిన అపాంగ్, ఓపో, మదువా తీసుకుంటారు. ఇంటికి వచ్చిన అతిధి లేదా బంధువులకు ఆల్కహాలు పోయడం సంస్కృతిగా వస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో పురుషులు ఎక్కువగా తీసుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాలలో తక్కువ ధర కలిగిన వాటిని, పట్టణ ప్రాంతాలలో బ్రాండెడ్ ఆల్కహాలు వినియోగిస్తున్నారు. పండుగలు, ఫంక్షన్లలో వినియోగం ఎక్కువగా ఉంది. సిక్కిం రాష్ట్రంలో హోమ్ మేడ్ రకాలైన ఛాంగ్, టోంగబా కు డిమాండ్ ఉంది. పండుగలు, ఇతర కార్యక్రమాల్లో మహిళలు, పురుషులు కలిసి ఆల్కహాలు సేవిస్తుంటారు. టూరిజం ప్రమోషన్ లో భాగంగా గోవాలో ఆల్కహాల్ తో పాటు ఫెనీ, బీర్, వైన్ అత్యధికంగా తీసుకుంటారు. ఝార్ఖండ్, చత్తీస్ గఢ్, త్రిపుర లో గిరిజనులు, గ్రామీణ ప్రాంతాలలో ఉండేవారు మద్యం సేవించడం గొప్పగా భావిస్తారు. మణిపూర్ లో కూడా ఆల్కహాల్ తీసుకోవడం సాంస్కృతిగా ఆచారంగా వస్తున్నది. స్థానిక బ్రాండ్లకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు.
 
                     X
                                    X
                                 Google News
                        Google News
                     Facebook
                        Facebook
                     Instagram
                        Instagram
                     Youtube
                        Youtube
                     Telegram
                        Telegram