త్వరలోనే డీలిమిటేషన్ కమిషన్..త్వరలోనే డీలిమిటేషన్ కమిషన
నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటామని..ఆ రాష్ట్రాలకు ఉన్న అభ్యంతరాలు, సమస్యలను పరిష్కరిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు
న్యూఢిల్లీ: నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటామని..ఆ రాష్ట్రాలకు ఉన్న అభ్యంతరాలు, సమస్యలను పరిష్కరిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగనివ్వబోమని స్పష్టం చేశారు. డీలిమిటేషన్ కమిషన్ యాక్ట్ ఇంకా రాలేదన్నారు. అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నందున తమిళనాడులో కొందరు దీనిపై రాద్దాంతం చేస్తున్నారన్నారు. త్వరలో డీలిమిటేషన్ కమిషన్ యాక్ట్ ను తీసుకువస్తామని ప్రకటించారు. పార్లమెంటులో డీలిమిటేషన్ యాక్ట్ పై చర్చిస్తామని..పూర్తి స్థాయి చర్చ తరువాతే చట్టం చేసి డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేస్తామని అమిత్ షా స్పష్టం చేశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram